కోల్గేట్ సంస్థకు జరిమానా విధించిన వినియోగదారుల ఫోరం..

  • IndiaGlitz, [Saturday,January 23 2021]

కోల్గేట్ సంస్థకు వినియోగదారుల ఫోరం మొత్తంగా రూ.15 వేల జరిమానా విధించింది. ఎక్కువ ధరకు పేస్ట్ అమ్ముతూ వినియోగదారులను మోసం చేస్తోందని కోల్గేట్ సంస్థపై ఓ వ్యక్తి వినియోగదారుల ఫోరంలో కేసు వేశాడు. కేసును విచారించిన వినియోగదారుల ఫోరం కోల్గేట్ సంస్థకు జరిమానా విధించింది. సంగారెడ్డికి చెందిన సీహెచ్ నాగేందర్ న్యాయవాదిగా పని చేస్తున్నారు. 2019 ఏప్రిల్‌ 7న సంగారెడ్డి పట్టణంలోని రిలయన్స్‌ ఫ్రెష్‌ రిటైల్‌ మాల్‌లో 150 గ్రాముల కోల్గేట్‌ మాక్స్‌ టూత్‌ పేస్ట్‌ రూ. 92కు కొనుగోలు చేశారు.

అయితే నాగేందర్ ఆ పేస్ట్‌తో పాటు 20 గ్రాముల కోల్గోట్‌ మాక్స్‌ టూత్‌పే‌స్ట్ రూ. 10లకు కొనుగోలు చేశారు. పది రూపాయలకు 20 గ్రాముల చొప్పున కొనుగోలు చేస్తే 150 గ్రాములకు రూ.75 అవుతుంది. కానీ 150 గ్రాముల పేస్ట్‌కు రూ.92 తీసుకున్నారు. అంటే రూ. 17 అదనంగా తీసుకుంటున్నారు. దీంతో నాగేందర్ వెంటనే పేస్టు ధరను ఎందుకు ఎక్కువ తీసుకున్నారంటూ కోల్గేట్‌ సంస్థ వారికి నోటీసులు పంపించారు. అయితే సంస్థ నుంచి నాగేందర్‌కు ఎలాంటి సమాధానమూ రాలేదు. దీంతో ఆయన వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు.

ఈ కేసును విచారించిన వినియోగదారుల ఫోరం కోల్గేట్‌ సంస్థకు జరిమానా విధించింది. సంస్థ అదనంగా వసూలు చేసిన రూ. 17 తిరిగి ఇవ్వాలని, ఆయనను మానసిక క్షోభకు గురిచేసినందుకు రూ.10 వేలు, ఖర్చుల కింద రూ.5 వేలు అదనంగా ఇవ్వాలని వినియోగదారుల ఫోరం చైర్మన్‌ పి.కస్తూరి, సభ్యురాలు డి.శ్రీదేవి తీర్పు చెప్పారు. వినియోగదారుల సంక్షేమ నిధికి అదనంగా రూ. 50 వేలు ఇవ్వాలని కోల్గేట్‌ సంస్థను ఆదేశించారు. ఇవన్నీ నెల రోజుల్లోగా వినియోగదారుడు నాగేందర్‌కు చెల్లించాలని వినియోగదారుల ఫోరం తేల్చి చెప్పింది.

More News

వ్యాక్సిన్ వేయించుకున్నట్టు ఫోటోలకు ఫోజులు.. అడ్డంగా బుక్కయ్యారు..

దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొందరి అతి తెలివి కారణంగా అభాసు పాలవుతోంది.

ఫొటో షేర్ చేసి డిలీట్ చేసిన సామ్..

సమంత అక్కినేని ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

నా నలుగురు కెప్టెన్స్ వీళ్లే: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి మంచి స్పీడు మీదున్నారు. వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెడుతున్నాడు. ఇప్ప‌టికే ఆచార్య సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు మెగాస్టార్.

అయోధ్య రామ మందిరం నిర్మాణానికి భారీ విరాళం అందజేసిన పవన్

అయోధ్య రామ మందిరం నిర్మాణానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భారీ విరాళాన్ని అందజేశారు.

ఫిబ్రవరి 19న 'చెక్' రిలీజ్

నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ప్రసాద్ నిర్మిస్తున్న  'చెక్' చిత్రం విడుదల తేదీ ఖరారైంది.