అబ్దుల్ క‌లామ్ బ‌యోపిక్ వివాదం

  • IndiaGlitz, [Tuesday,February 11 2020]

మాజీ రాష్ట్ర‌ప‌తి, అణు శాస్త్ర‌వేత్త డా.అబ్దుల్ క‌లామ్ గురించి ప్రత్యేక‌మైన పరిచ‌యం అక్క‌ర్లేదు. త‌న విజ్ఞానంతో మిస్సైల్స్‌ను త‌యారు చేసి భారత ఆర్మీ బ‌లాన్ని పెంచిన గొప్ప సైంటిస్ట్‌. ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినిమాల్లో ఉన్న బ‌యోపిక్స్ ట్రెండ్‌లో అబ్దుల్ క‌లామ్ బ‌యోపిక్‌ను కూడా రూపొందించ‌డానికి ద‌ర్శక నిర్మాత‌లు సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌ముఖ నిర్మాతలు అనీల్ సుంక‌ర‌, అభిషేక్ అగ‌ర్వాల్ తాము అబ్దుల్ క‌లామ్ బ‌యోపిక్ తీయ‌బోతున్న‌ట్లు చాలా రోజుల ముందే ప్ర‌క‌టించారు. అయితే రీసెంట్‌గా హాలీవుడ్ మూవీగా జ‌గ‌దీష్ దానేటి అబ్దుల్ క‌లామ్ బ‌యోపిక్‌ను తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అలీ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమా పోస్ట‌ర్‌ను కేంద్రమంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ విడుద‌ల చేశారు.

దీంతో నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్ తాము అబ్దుల్ క‌లామ్ బ‌యోపిక్, డాక్యుమెంట‌రీ చేయ‌డానికి ఆయ‌న కుటుంబ స‌భ్యుల నుండి ప‌ర్మిష‌న్ తీసుకున్నామ‌ని, ఈ నిబంధ‌న‌లను ఎవ‌రైనా అతిక్ర‌మిస్తే చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఇన్‌డైరెక్ట్‌గా జ‌గ‌దీష్ దానేటి అండ్ టీమ్‌ను హెచ్చ‌రిస్తూ ట్వీట్ చేశారు. ఇప్పుడు జ‌గ‌దీష్ దానేటి ఈ వ్య‌వ‌హారంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More News

ప్రముఖ సినీ జర్నలిస్ట్ పసుపులేటి ఇకలేరు..

ప్రముఖ సినీ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు.

12న కర్నూలు, 15న రాజధానిలో పవన్ పర్యటన

టాలీవుడ్ పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటు సినిమాలు.. అటు రాజకీయాలతో బిజిబిజీగా గడుపుతున్నారు.

రాపాకను రప్ఫాడేస్తున్న జన సైనిక్స్.. అసలేం జరిగింది!

2019 ఎన్నికల్లో జనసేన తరఫున వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

పోలీస్ స్టేషన్ల మెట్లెక్కుతున్న నటీమణులు.. ఎందుకిలా!?

సోషల్ మీడియా వాడకం రోజురోజుకూ పెరిగిపోతోంది.. రోజురోజుకూ దీని గురించి తెలియని వారు కూడా తెలుసుకుని సోషల్ రంగంలోకి దిగుతున్నారు.

సరికొత్త లుక్‌లో రానా.. సిద్ధమవుతోన్న త్రిభాషా చిత్రం

దేశంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌.. వైవిధ్యమైన కథా చిత్రాలకు అండగా నిలబడుతూ ఇండియన్‌ సినిమాను భవిష్యత్తులో అద్భుతంగా ముందుకు నడిపిస్తోంది.