close
Choose your channels

Cordelia Cruise Ship : నడిసంద్రంలో నిలిచిపోయిన వైజాగ్ క్రూయిజ్ షిప్.. ఎందుకిలా..?

Saturday, June 11, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సముద్రంలో విహారయాత్రకు వెళ్లాలనుకునే వారి కోసం ఇటీవల విశాఖకు చేరుకుంది లగ్జరీ కార్డీలియా క్రూయిజ్ షిప్. కార్డీలియా క్రూయిజ్ కంపెనీ నడిపే ఈ షిప్ సముద్రంలో తేలియాడే స్టార్ హోటల్‌ను తలపిస్తుంది. ఇటీవలే వైజాగ్ నుంచి పుదుచ్చేరికి బయల్దేరిన ఈ క్రూయిజ్‌ షిప్‌ అప్పుడే వివాదాల్లోకెక్కింది. క్యాసినో, గ్యాంబ్లింగ్ ఆడే క్రూయిజ్‌ను పుదుచ్చేరిలోకి అనుమతించేది లేదని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తేల్చిచెప్పడంతో ఆ నౌక శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి నడి సముద్రంలోనే వుండిపోయింది. రాష్ట్రంలోని వివిధ పార్టీలు సైతం గవర్నర్ నిర్ణయానికి మద్ధతు పలకడం విశేషం.

టూరిజం అభివృద్ధి కావాలి.. కానీ సంస్కృతికి విరుద్ధంగా కాదు: తమిళిసై

క్రూజ్‌‌ను అనుమతించడం, అనుమతించకపోవడంపై తాము స్పష్టంగా ఉన్నామని తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. అందులో క్యాసినో, గ్యాంబ్లింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమన్నారు. తొలుత అలాంటివేవి లేవని నిర్ధారణ చేయాల్సి ఉందన్నారు . టూరిజంను అభివృద్ధి చేయాలనే ఆసక్తితో ఉన్నామని.. కానీ మన సంస్కృతికి విరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోబోమని తమిళిసై స్పష్టం చేశారు. కేవలం ఆదాయం కోసం యువత జీవితాలను పాడు చేయకూడదని అనుకుంటున్నామని లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు.

షిప్‌లో లగ్జరీ సౌకర్యాలు:

జూన్ ఆరో తేదీన చెన్నై నుంచి బయల్దేరిన ఈ క్రూయిజ్ షిప్.. విశాఖ నుంచి జూన్ 8వ తేదీ రాత్రి బయల్దేరి జూన్ పదో తేదీ ఉదయం ఏడు గంటలకు పుదుచ్చేరి చేరుకోవాల్సి వుంది. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం కారణంగా ఈ షిప్ సముద్రంలోనే నిలిచిపోయింది. 2000 మంది ప్రయాణించే వీలున్న ఈ షిప్.. 36 గంటల్లో విశాఖ నుంచి చెన్నై చేరుకుంటుంది. కార్డీలియా క్రూయిజ్‌లో 11 అంతస్థులు ఉంటాయి. పదకొండో అంతస్థు నుంచి సముద్రంలో సూర్యోదయం, సూర్యాస్తమయాలను వీక్షించడం మధురానుభూతిని కలిగిస్తుంది. పిల్లలు ఆడుకోవడం కోసం ఈ షిప్‌లో కార్డీలియా కిడ్స్ అకాడమీ పేరిట విశాల ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. దీనితో పాటు జిమ్, స్విమ్మింగ్ పూల్, కేసినో, కామెడీ షోల కోసం ఆడిటోరియం, కొత్త సినిమాలను చూడటం కోసం థియేటర్లు, 24 గంటల సూపర్ మార్కెట్ వున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.