Coromandel:రూ.1000కోట్లతో కాకినాడలో కోరమాండల్ ప్రాజెక్ట్

  • IndiaGlitz, [Tuesday,April 30 2024]

ఏపీలో మరో దిగ్గజ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఎరువుల తయారీలో పేరొందిన కోరమాండల్‌ కంపెనీ కాకినాడ సమీపంలో దాదాపు రూ.1000 కోట్లతో ఫాస్ఫరిక్‌ యాసిడ్‌-సల్ఫరిక్‌ యాసిడ్‌ కాంప్లెక్స్‌ ఫెసిలిటీ నిర్మాణ పనులను ప్రారంభించింది. ఇప్పటికే శంకుస్థాపన కూడా జరిగిపోయింది. రెండేళ్ల వ్యవధిలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. 20 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో కాకినాడ వద్ద నిర్మిస్తున్న ఈ ఫాస్ఫటిక్ ఫెర్టిలైజర్ తయారీలో దేశంలోనే రెండవ అతి పెద్దది కావడం విశేషం.

రోజుకు సుమారు 650 టన్నుల తయారీ సామర్థ్యంతో ఫాస్పరిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేసే విధంగా కంపెనీ రూపుదిద్దుకోనుంది. అదేవిధంగా రోజుకు దాదాపు 1,800 టన్నుల సామర్థ్యం గల సల్ఫరిక్ యాసిడ్ ప్లాంటు సైతం ఇక్కడ కొలువుదీరనుంది. ఈ క్రమంలోనే కాకినాడ ప్లాంటు దిగుమతి చేసుకుంటున్న యాసిడ్ అవసరాల్లో ప్రతిపాదిత కేంద్రం సగానికి పైగా భర్తీ చేస్తుందని.. ఎరువుల తయారీకి కావాల్సిన ఫాస్పరిక్ యాసిడ్ సరఫరా చేస్తుందని సంస్థ ప్రకటించింది.

ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెట్టుబడి మద్దతును కోరుతోంది. ఇలా చేయడం వల్ల ఎరువుత తయారీకి కీలక ముడి పదార్థాల సరఫరా భద్రతను నిర్థారిస్తుందని భావిస్తోంది. ప్రస్తుతం కోరమాండల్‌కు వైజాగ్‌తో పాటు ఎన్నూర్‌లో ఫెర్టిలైజర్ ప్లాంట్స్ ఉన్నాయి. దేశంలో తయారయ్యే NPK(నైట్రోజన్, ఫాస్పరస్, పోటాషియం) ఎరువుల్లో 15 శాతం ఇక్కడే ఉత్పత్తి కానున్నాయి. ఈ సంస్థ ఏర్పాటు వల్ల కాకినాడ చుట్టుపక్కల ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

More News

Corona Vaccine:కరోనా వ్యాక్సిన్‌తో రక్తం గడ్డకట్టం నిజమే.. అంగీకరించిన సంస్థ..

నాలుగు సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసి కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అనేక సంస్థలు వ్యాక్సిన్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

10th Class Results:తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి..

తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు.

Chandrababu:పెన్షనర్లపై కక్షగట్టిన చంద్రబాబు.. తగిన బుద్ధి చెబుతామంటున్న ప్రజలు..

ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గరి నుంచి రాష్ట్రంలోని పెన్షనర్లపై టీడీపీ అధినేత చంద్రబాబు కక్షకట్టారు. ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయాన్నే వాలంటీర్లు ఇంటికి వెళ్లి మరి పింఛన్లు అందించేవారు.

Revanth: ఢిల్లీ పోలీసుల నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ పోలీసులు జారీ చేసిన నోటీసులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీపై పోరాటం చేసే వారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు.

Nominations Withdraw: ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు.. బరిలో ఎంతమంది ఉన్నారంటే..?

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో కీలమైన నామినేషన్ల ప్రక్రియకు నేటితో తెరపడింది. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు...