అక్కడ కరోనా రెండో దశ ప్రారంభం.. తెలంగాణలో అధికారుల అప్రమత్తం..

  • IndiaGlitz, [Friday,October 30 2020]

కరోనా ప్రభావంతో పాటు భయం కూడా జనాల్లో బాగా తగ్గిపోయింది. జనజీవనం అంతా యథాతథ స్థితికి వచ్చేసింది. లాక్‌డౌన్ సమయంలో మూసివేసిన సంస్థలన్నీ ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి. సినిమా షూటింగ్‌లు ప్రారంభమైపోయాయి. మూతవేయబడిన పరిశ్రమలన్నీ తెరుచుకున్నాయి. చివరకు లోకల్ బస్సులు కూడా ప్రారంభమై పోయాయి. ఇంకేముంది కరోనా మనల్ని వదిలేసినట్టే.. మనకు పూర్తి స్వేచ్ఛ వచ్చేసింది.. అని ఫీల్ అయితే తప్పులో కాలేసినట్టే అంటున్నారు తెలంగాణకు చెందిన అధికారులు.

ప్రస్తుతం శీతాకాలం ప్రారంభమైంది. ఈ చలికాలంలో వైరస్ వేగంగా విజృంభించే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ (రెండోదశ) కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణ అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా రెండో దశ విజృంభించే అవకాశం ఉందని.. పండుగలు సైతం ఉన్నందున ప్రజలు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు.

వచ్చే 3 నెలలూ జాగ్రత్త..

శీతాకాలం కొనసాగుతున్నందున ఈ మూడు నెలలూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణంలో మార్పులతో పాటు చలికాలం కూడా కావడంతో జలుబు, దగ్గు వంటివి కామన్‌గా వస్తాయని.. ప్రస్తుతం కరోనా సమయంలో ఇవి చాలా డేంజర్ అని అధికారులు పేర్కొంటున్నారు. చలికాలంలో బ్రీతింగ్ సమస్య సైతం వచ్చే అవకాశముందని.. కాబట్టి ఆస్తమా రోగులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి నియమాల విషయంలో నిర్లక్ష్యం వద్దన్నారు. జలుబు, దగ్గు, జ్వరం, ఇతర లక్షణాలు ఉంటే కరోనా టెస్టు చేయించుకోవాలని అధికారులు సూచించారు.

More News

'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం ఆలియా భట్‌ పాట

బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో

ఇండియాలో రికార్డ్ స్థాయిలో ఆపిల్ అమ్మకాలు..

భారతదేశంలో ఇటీవలే ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించిన టెక్ దిగ్గజ సంస్థ ఆపిల్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.

మూడు చిత్రాలను ప్రకటించిన ఫోర్బ్స్‌లో చోటు దక్కించుకున్న యువ వ్యాపారవేత్త సురేష్‌రెడ్డి

కొవ్వూరి సురేష్‌రెడ్డి... యానిమేషన్‌ గేమింగ్ రంగంలో ఈ పేరు సుపరిచితమే.

టీడీపీ నేతలపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..

మంత్రి కొడాలి నాని టీడీపీ నేతలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..

ఈసారి కూడా ట్రంపే గెలుస్తారట...

నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సమయం పెద్దగా లేదు. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేదే ఆసక్తికర విషయం.