తెలంగాణలో 2 వేలు దాటిన కేసులు

  • IndiaGlitz, [Thursday,April 08 2021]

తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. గత ఏడాది కరోనా భయానకం సృష్టిస్తున్న సమయంలో నమోదైనన్ని కేసులు తాజాగా నమోదవుతుండటం గమనార్హం. రోజు వారీ కరోనా కేసులు రెండు వేలు దాటాయి. తాజాగా హెల్త్ బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. నిన్న రాత్రి 8గంటల వరకు 87,332 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... తెలంగాణలో కొత్తగా 2,055 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,18,704 కి చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఏడుగురు మృతి చెందగా.. మొత్తం ఇప్పటి వరకూ 1,741 మంది మరణించారు. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారి నుంచి 303 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3,03,601కి చేరింది. ప్రస్తుతం 13,362 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 8,263 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరణాల రేటు 0.54 శాతం ఉండగా.. కోలుకున్న వారి రేటు 95.26 శాతంగా ఉంది.

More News

‘ఇంట్రడ్యూసింగ్‌ పుష్పరాజ్‌’ : తగ్గేదే.. లే

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న పాన్‌ ఇండియా మూవీ 'పుష్ప'. బన్నీ, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడవ చిత్రంగా ‘పుష్ప’ తెరకెక్కుతోంది.

రాధిక దంపతులకు ఏడాది జైలు శిక్ష

తమిళ నటుడు శరత్ కుమార్, అతని భార్య, నిర్మాత రాధికా శరత్ కుమార్‌లకు చెక్ బౌన్స్ కేసులో ఏడాది పాటు జైలు శిక్ష పడింది. చెన్నైలోని సైదాపేట కోర్టు

ఉత్కంఠకు తెర.. ఏపీలో పరిషత్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ కొట్టేసి..

ఆర్జీవికి డెత్ డే విషెస్ అంటూ ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లు

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ఆయన సినిమాల కాదు.. ఆయన కూడా తన ట్వీట్ల ద్వారా ప్రత్యేకంగా నిలుస్తుంటారు.

దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు..

భారత్‌ను సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో కలవరపెడుతోంది. ఊహించని స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది కూడా చూడనంతగా.. రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అంతా ప్రశాంతం