వరుసగా ఆరో రోజు 50 వేలు దాటిన కరోనా కేసులు..

  • IndiaGlitz, [Tuesday,August 04 2020]

దేశంలో కరోనా మహమ్మరి విజృంభణ కొనసాగుతోంది. ఆరు రోజులుగా కరోనా కేసులు దేశంలో 50 వేలకు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య కూడా 18.55 లక్షలకు పైనే చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం కరోనా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది.

గడచిన 24 గంటల్లో 52,050 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,55,746కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 803 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా మొత్తం 38,938 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 5,86,298 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 12,30,510కి చేరుకుంది. కాగా దేశంలో రికవరీ రేట్ 66 శాతానికి చేరుకుంది.

More News

తెలంగాణలో తాజాగా 1286 కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్‌ను మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనాతో మృతి

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనాతో మృతి చెందారు. కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో రాజయ్య బాధపడుతున్నారు.

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ఇక లేరు..

ప్ర‌ముఖ వాగ్గేయకారుడు వంగ‌పండు ప్ర‌సాద‌రావు(77)  మంగ‌ళ‌వారం క‌న్నుమూశారు.

ఏపీలో ఊరటనిస్తున్న కరోనా.. నేడు ఎన్ని కేసులంటే..

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టి కాస్త ఊరటనిస్తోంది. వరుసగా మూడు రోజుల పాటు పది వేలకు పైగా నమోదైన కేసులు నిన్న 8 వేలు నమోదవగా..

48 గంటలు టైమిస్తున్నా.. అసెంబ్లీని రద్దు చేసి రండి: చంద్రబాబు సవాల్

మూడు రాజధానుల అంశం ఏపీలో కాక రేపుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు ఇచ్చిన జగన్..