ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. నేడు మరోసారి 10 వేలకు పైగా కేసులు

  • IndiaGlitz, [Saturday,August 29 2020]

ఏపీలో కరోనా మరోమారు విజృంభిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరుసగా 10 వేలు నమోదైన కేసులు మధ్యలో కాస్త తగ్గాయి. తిరిగి మూడు రోజులుగా మరోసారి 10 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 61,331 శాంపిళ్లను పరీక్షించగా.. 10,526 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ కరోనా సోకిన వారి సంఖ్య 4,03,616కి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 35,41,321 శాంపిళ్లను పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

అయితే ఒక్కరోజులో 8463 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా... గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 81 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 3,714కి చేరుకుంది. కాగా నేడు చిత్తూరు జిల్లాలో 10 మంది, కడప తొమ్మిది మంది, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 8 మంది చొప్పున, తూర్పు గోదావరి, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, అనంతపురం, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, గుంటూరులో నలుగురు, విజయనగరం జిల్లాలో ఒక్కరు చొప్పున మృతి చెందారు.

More News

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వైద్యుల మాటలకు స్పందిస్తున్నారు: ఎంజీఎం

ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కొద్ది రోజుల పాటు బాగానే ఉన్న ఆయన ఆరోగ్యం ఇటీవల విషమించిందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

‘వ‌కీల్ సాబ్‌’ బ‌ర్త్ డే ట్రీట్ అదేనా..?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన‌రోజు సెప్టెంబ‌ర్ 2.

ఆదా శర్మ కొత్త సినిమా 'క్వశ్చన్ మార్క్ (?)'

శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై ఆదా శర్మ హీరోయిన్ గా విప్రా దర్శకత్వం లో  గౌరీ కృష్ణ నిర్మాతగా గౌరు ఘనా సమర్పణలో

‘ఆదిపురుష్’ గురించి ప్ర‌భాస్ ప్లాన్‌..!!

ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టుల‌ను అనౌన్స్ చేస్తూ వ‌స్తున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ ఓంరావుత్ ద‌ర్శ‌క‌త్వంలో

‘ఆచార్య’ క‌థ రిజిష్ట‌ర్ కాలేదా...!!

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రీసెంట్‌గా కాపీ రైట్ స‌మ‌స్య‌ను ఎదుర్కొంది.