close
Choose your channels

ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఏపీలో ఎక్కువే!

Thursday, April 2, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఏపీలో ఎక్కువే!

యావత్ దేశవ్యాప్తంగా కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య గంట గంటకూ పెరిగిపోతోంది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి ఇండియా కోలుకుంటోందనుకున్న టైమ్‌కు ఢిల్లీలోని నిజాముద్దీన్ ఘటనతో ఒక్కసారిగా కరోనా కేసులు ఊహించని రీతిలో పెరిగాయి. మొత్తానికి చూస్తే కరోనా తీవ్రత పెరుగుతున్నట్లే తెలుస్తోంది. ఈ పాజిటివ్ కేసుల విషయమై తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా.. దేశ వ్యాప్తంగా 1,965 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. 50 మంది మృతి చెందగా.. 150 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. కాగా ప్రస్తుతం కరోనా చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1764 చేరుకుంది.

రాష్ట్రాల వారిగా చనిపోయిన లెక్కలివీ..

మహారాష్ట్రలో 335 పాజిటివ్‌ కేసులు..13 మంది మృతి
మధ్యప్రదేశ్‌లో 99 పాజిటివ్‌ కేసులు..ఆరుగురు మృతి
గుజరాత్‌లో 82 పాజిటివ్‌ కేసులు..ఆరుగురు మృతి
కేరళలో 265 పాజిటివ్‌ కేసులు..ఇద్దరు మృతి
కర్ణాటకలో 110 పాజిటివ్‌ కేసులు.. ముగ్గురు మృతి
తమిళనాడులో 234 పాజిటివ్‌ కేసులు.. ఒకరు మృతి
ఢిల్లీలో 152 కరోనా పాజిటివ్‌ కేసులు..ఇద్దరు మృతి

పంజాబ్‌లో 46 కరోనా పాజిటివ్‌ కేసులు.. నలుగురు మృతి
యూపీలో 113 పాజిటివ్‌ కేసులు.. ఇద్దరు మృతి
బెంగాల్‌లో 37 కరోనా పాజిటివ్‌ కేసులు.. ముగ్గురు మృతి
బిహార్‌లో 23 పాజిటివ్‌ కేసులు.. ఒకరు మృతి
జమ్మూకశ్మీర్‌-62, హర్యానా-43, చండీగఢ్‌-16, చత్తీస్‌గఢ్‌-9..
రాజస్థాన్‌-108, ఒడిశా-4, పుదుచ్చేరిలో మూడు పాజిటివ్‌ కేసులు
మణిపూర్‌, మిజోరాం, అసోం, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఒక్కో కేసు నమోదు

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..:-

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 132కు చేరుకుంది. కేవలం 12 గంటల వ్యవధిలో 21 పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చినవారిలో అత్యధికులు ఢిల్లీ వెళ్లొచ్చినవాళ్లేనని అధికారులు చెబుతున్నారు.

జిల్లాల వారిగా..

గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 20 చొప్పున కేసులు
ప్రకాశం-17, కడప, కృష్ణా జిల్లాల్లో 15 చొప్పున కేసులు
ప.గో-14, విశాఖ-11, తూ.గో-9, చిత్తూరులో 8పాజిటివ్‌ కేసులు
అనంతపురంలో 2, కర్నూలులో ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. అయితే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఇంతవరకూ ఒక్కకేసు కూడా నమోదవ్వడం మంచి పరిణామమే.

తెలంగాణలో..

రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే 30 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. కానీ ఇవాళ మాత్రం కొత్తగా కేసులేమీ నమోదు కాలేదు. ఇంతవరకూ ఆరోగ్య శాఖ తాజా బులెటిన్ విడుదల చేయలేదు. అయితే.. తాజాగా మూడు మరణాలు సంభవించాయని, వీరంతా ఢిల్లీ నిజాముద్దీన్‌ తబ్లిగీ జమాత్‌లోని మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారేనని కేసీఆర్ బుధవారం నాడు ప్రకటించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.