ఏపీలో భయాందోళన రేకెత్తిస్తున్న కరోనా కేసులు..

  • IndiaGlitz, [Saturday,July 11 2020]

ఏపీలో కరోనా కేసులు భయాందోళనను రేకెత్తిస్తున్నాయి. కరోనా బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 20,590 శాంపిళ్లను పరిశీలించగా 1813 కేసులు నమోదయ్యాయి. వీటిలో రాష్ట్రానికి చెందినవి 1775 కాగా.. ఇతర రాష్ట్రాలకు చెందిన 34 మందికి.. విదేశాలకు చెందిన నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27 వేల 235కు చేరుకుంది.

కాగా గడిచిన 24 గంటల్లో 17 మంది మృతి చెందారు. కర్నూలు జిల్లాకు చెందిన నలుగురికి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కృష్ణ, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరికి చొప్పున.. అనంతపురం, విశాఖ, కడప జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 12533 యాక్టివ్ కేసులుండగా.. 14393 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

More News

విశ్వ‌క్ సేన్‌కు క్రేజీ ఆఫ‌ర్‌

‘వెళ్లిపోమాకే’ సినిమాతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన విశ్వ‌క్‌సేన్‌కు ‘ఈన‌గ‌రానికి ఏమైంది’ సినిమా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

ప్రగతి భవన్‌‌కు కేసీఆర్.. అన్ని విమర్శలకూ చెక్..

తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌కు వచ్చారు. కాగా.. సీఎం కేసీఆర్ ఎక్కడా..

ఇంత నిర్లక్ష్యమా? ఇది మీకు తగునా?

కరోనా మృతదేహాన్ని అత్యంత జాగ్రత్తగా తరలించాలి. నిబంధనల ప్రకారమైతే తరలించే సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి..

దిల్‌రాజు అడుగు అక్క‌డ కూడా!!

తెలుగు చిత్ర నిర్మాత‌ల్లో దిల్‌రాజుకు ఓ ప్ర‌త్యేక‌స్థానం ఉంది. ఆయ‌న అగ్ర హీరోల‌తో పాటు కొత్త కంటెంట్ సినిమాల‌ను కూడా చేయ‌డంలో ఆస‌క్తి చూపిస్తుంటారు.

‘నాలో.. నాతో.. వైఎస్సార్‌’కు భారీ ఆదరణ.. దీంతో కొందరేం చేశారంటే..

మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో.. వైఎస్సార్‌’ పుస్తకానికి