తెలంగాణలో మూడు రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

  • IndiaGlitz, [Monday,July 13 2020]

తెలంగాణలో గత మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుతూ వస్తోంది. అంతకు ముందు 1800లకు పైన నమోదైన కేసులు.. ప్రస్తుతం 1300ల లోపే నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. ఆదివారం 8153 శాంపిల్స్‌ను పరిశీలించగా.. 1269 మందికి పాజటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 34,671కి చేరుకుంది.

కరోనా కారణంగా ఆదివారం 8 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 356కు చేరుకుంది. తెలంగాణలో ప్రస్తుతం 11,883 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి కోలుకుని 1563 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకూ 22,482 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నిన్న 800 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.

More News

బిగ్‌బికి ధైర్యం చెప్పిన కాసేపటికే.. అనుపమ్ ఖేర్‌ ఇంట కరోనా కల్లోలం

కరోనా మహమ్మారి బాలీవుడ్‌ను భయపెడుతుంది. బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా అని ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించగానే బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్

ఐశ్వర్యారాయ్.. ఆమె కూతురు ఆరాధ్యకూ కరోనా పాజిటివ్

ప్రముఖ నటి, అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్యారాయ్ బచ్చన్, వారి కూతురు ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

అమితాబ్‌జీ ఆ విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది: పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బిగ్‌బి అమితాబ్ బచ్చన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఓ పోస్ట్ పెట్టారు.

పవన్ ‘తొలిప్రేమ’ను టార్గెట్ చేస్తున్న వర్మ!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

తెలంగాణలో శనివారం గణనీయంగా తగ్గిన కేసులు...

తెలంగాణలో శనివారం కరోనా కేసులు చాలా వరకూ తగ్గాయి. కొద్ది రోజులుగా 5వేల శాంపిల్స్‌ను పరిశీలిస్తేనే..