తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. ప్రతి 3 టెస్టులకు ఒక పాజిటివ్

  • IndiaGlitz, [Sunday,June 28 2020]

తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నిన్న నిర్వహించిన టెస్టుల ప్రకారం చూస్తే ప్రతి మూడు టెస్టులకు గాను ఒక పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. శనివారం రాష్ట్రంలో 3923 కరోనా టెస్టులు నిర్వహించగా.. 1087 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 13,436కు చేరుకుంది. నిన్న తెలంగాణ వ్యాప్తంగా కరోనా కారణంగా ఆరుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తం మృతుల సంఖ్య 243కు చేరుకుంది. నిన్న కరోనాన నుంచి కోలుకుని 162 మంది డిశ్చార్జ్ కాగా.. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తంగా 4928కి చేరుకుంది. కాగా తెలంగాణలో 8265 యాక్టివ్ కేసులున్నాయి.

కాగా.. తెలంగాణ కరోనా పాజిటివ్ కేసుల పరంగా చూస్తే మొదటి నుంచి జీహెచ్ఎంసీ ప్రథమ స్థానంలో ఉంది. నిన్న ఒక్కరోజే 888 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
రంగారెడ్డిలో 74, మేడ్చల్ లో 37, నల్గొండలో 35, సంగారెడ్డిలో 11, కామారెడ్డి, కరీంనగర్‌లో 5, వరంగల్ అర్బన్‌లో 7, మహబూబ్ నగర్‌లో 5, నాగర్ కర్నూల్‌లో 4, జనగాంలో 4, సిరిసిల్లలో 3, సిద్దిపేటలో 2, భద్రాద్రి కొత్తగూడెంలో 2, ఆసీఫాబాద్, ఖమ్మం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్‌లో ఒక్కో కేసు నమోదైనట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

More News

పలాస దర్శకుడి వెబ్ సిరీస్..!

తొలి చిత్రం ‘ప‌లాస 1978’ సినిమాతో అటు ప్రేక్ష‌కుల‌ను మెప్పించి ఇటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు క‌రుణ కుమార్‌.

మ‌రో హిస్టారిక్ మూవీ ఘాజీ ద‌ర్శ‌కుడు

సంక‌ల్ప్ రెడ్డి.. `ఘాజీ`, `అంత‌రిక్షం` సినిమాలో అంద‌రి దృష్ఠిని ఆక‌ర్షించాడు.

టీవీ పరిశ్రమలోని ఆ 33 మంది కరోనా ఫలితం వచ్చేసింది..

లాక్‌డౌన్ అనంతరం ఇటీవలే షూటింగ్‌లకు సిద్ధమైన టీవీ పరిశ్రమకు నటుడు ప్రభాకర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో షాక్ తగిలనట్టైంది.

ఢిల్లీ - గురుగ్రామ్ సరిహద్దుల్లో మిడతల దండు..

ఓ పక్క కరోనా దేశాన్ని కుదిపేస్తుంటే.. మరోపక్క మిడతల దండు భయాందోళనకు గురి చేస్తోంది.

కీలక నిర్ణయం తీసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబం

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. సుశాంత్ మరణించి 13 రోజులైన సందర్భంగా ‘గుడ్‌బై సుశాంత్’ పేరుతో ఓ ప్రకటనను విడుదల చేసింది