కరోనా ఎఫెక్ట్ : కేసీఆర్ ప్రకటనాంతరం చిరు కీలక నిర్ణయం

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని స్కూల్స్, థియేటర్స్, బార్లు, పబ్‌లు, క్లబ్‌లు, అవుడ్ డోర్.. ఇండోర్ స్టేడియాలు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, జూపార్కులు, పార్కులు, మ్యూజియమ్స్ మూసివేయాలని కేసీఆర్ తేల్చిచెప్పారు. సర్కార్ నిర్ణయాన్ని కాదని నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని కూడా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పటికే థియేటర్స్ మూసివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరోవైపు టాలీవుడ్ హీరోల సినిమాలు, షూటింగ్స్‌ దాదాపు వాయిదా వేసుకోవడం జరిగింది.

తాజాగా.. మెగాస్టార్ చిరంజీవి కూడా కేసీఆర్ ప్రకటనాంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తన సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా మహమ్మారి నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, దీన్ని ప్రభుత్వానికే వదిలేయకుండా ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. తనవంతు బాధ్యతగా తన సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తున్నానని ప్రకటించారు. కరోనా నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. కరోనా సోకిన వారికి తగిన చికిత్స అందించడం, వైరస్ వ్యాప్తి చెందకుండా క్రీడలను వాయిదా వేయడం, సినిమా హల్స్‌ను, మాల్స్‌ను మూసివేడయం, స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ప్రకటించడం మంచి పరిణామం అని అన్నారు. ప్రజలు కూడా ముందుస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

కేసీఆర్ నిర్ణయం నమ్మకం పెంచింది!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల్లో ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారు కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానన్నారు. సినిమా షూటింగుల్లో కూడా పెద్ద సంఖ్యలో టెక్నీషియన్లు పనిచేయాల్సి ఉందని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 10 నుండి 15 రోజుల వరకు షూటింగులు వాయిదా వేస్తే మంచిదని భావిస్తున్నానన్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్న తన సినిమా షూటింగ్‌ను వాయిదా వేద్దామని దర్శకుడు కొరటాల శివతో చెప్పినప్పుడు ఆయన వెంటనే సరేనన్నారని చెప్పారు. ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదు కాబట్టి ఆర్థికంగా కొంత ఇబ్బంది కలిగే అకవాశం ఉన్నప్పటికీ కరోనా వైరస్‌ను నియంత్రణ చేసే ఉద్యమంలో సినీరంగం కూడా పాలుపంచుకోవాలని కోరుతున్నానన్నారు. దీనికి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నానని ఓ ప్రకటనలో తెలిపారు.

More News

రెండున్నర గంటలు హ్యాపీగా నవ్వుకునే సినిమా ‘ఒరేయ్‌ బుజ్జిగా'... రాజ్ తరుణ్

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీరాధామోహన్‌ సమర్పణలో

చిరు-త్రివిక్రమ్ కాంబోలో మూవీ.. పిచ్చ కామెడీ..!

‘అల వైకుంఠపురములో..’ బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రేంజ్ మారిపోయింది.

స్ప్రైట్‌లో పురుగులు.. కంగుతిన్న జనం

శీతల పానీయాల్లో ఈ మధ్య ఎక్కడ చూసినా పురుగులు ప్రత్యక్షమవుతున్నాయ్. సదరు కూల్ డ్రింక్స్ తయారు చేసే ముందు..

రేవంత్‌ను కాంగ్రెస్‌ నుంచి తరిమేయాలనుకుంటున్నారా..!?

తెలంగాణ కీలకనేత, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి తరిమేయడానికి పక్కా ప్లాన్‌తో ఆ పార్టీ నేతలు ముందుకెళ్తున్నారా..?

ఏపీ బీజేపీకి కొత్త బాస్ ఈయనే.. పవన్ నిర్ణయమే!?

యావత్ భారతదేశ వ్యాప్తంగా కమలాన్ని వికసింపచేయాలని ఢిల్లీ కమలనాథులు భావిస్తున్నారు.