క‌రోనా క‌ష్టాలు .. ఎడారిలో చిక్కుకున్న స్టార్ హీరో

  • IndiaGlitz, [Wednesday,April 01 2020]

క‌రోనా ప్ర‌భావం కార‌ణంగా దేశ‌మంతా ముఖ్య‌మైన ప‌నులు, ర‌వాణా, ప్ర‌ధాన ఆర్థిక కార్య‌కలాపాలు అన్నీ స్తంభించాయి. సినిమా ప‌రిశ్ర‌మ అయితే షూటింగ్‌ల‌న్నింటినీ ఆపేశాయి. స్త‌బ్ద‌త నెల‌కొంది. ఈ త‌రుణంలో ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన లాక్‌డౌన్‌కు అన్నీ వ‌ర్గాల వారు త‌మ మ‌ద్దతుని తెలియ‌జేశారు. కానీ మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌కు చెందిన స్టార్ హీరో పృథ్వీరాజ్ అండ్ యూనిట్ మాత్రం యూరోప్‌లోని జోర్డాన్ ఏడారిలో చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లి ఇప్పుడు ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ పృథ్వీరాజ్ ట్విట్ట‌ర్ ద్వారా లేఖ రాశారు.

పృథ్వీరాజ్, బ్లెస్సీ కాంబినేష‌న్‌లో ఆడుజీవితం అనే సినిమా ప్రారంభ‌మైంది. కీల‌క స‌న్నివేశాల‌ను జోర్డాన్ ఎడారిలో చిత్రీక‌రించ‌డానికి అక్క‌డి ప్ర‌భుత్వం నుండి ఆదేశాల‌ను పొందారు. ఏప్రిల్ 10 వ‌ర‌కు షూటింగ్ జ‌రుపుకోవాల్సిన ఈ సినిమా .. క‌రోనా ఎక్కువగా ప్ర‌బ‌లుతుండ‌టంతో స‌ద‌రు అధికారులు షూటింగ్‌ను ఆపేయాల్సిందిగా కోరారు. దీంతో 58 మంది స‌భ్యులున్న యూనిట్ ఇప్పుడు అక్క‌డే చిక్కుకుపోయింది. మ‌న దేశానికి విమాన రాక‌పోక‌లు కూడా లేక‌పోవ‌డంతో ఎంటైర్ యూనిట్ చిక్కుపోయింది. ఎలాగైనా త‌మ‌ను ఇండియాకు వ‌చ్చేలా ప్ర‌భుత్వమే చొర‌వ చూపాల‌ని కోరుతూ లేఖ‌ను రాశారు పృథ్వీరాజ్‌.

More News

షాకింగ్: మర్కజ్ చీఫ్ ఆడియో టేపుల కలకలం.. రంగంలోకి దోవల్!

దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనల గురించే చర్చ. ఈ ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో ఎక్కువ మంది కరోనా వైరస్ బారినపడినట్టు నిర్ధారణ కావడంతో ప్రపంచ

ఆపరేషన్ 'నిజాముద్దీన్'.. మర్కజ్ వెళ్లిన వారి జాబితా రెడీ!

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన నిజాముద్దీన్ మర్కజ్‌ ముస్లింల ప్రార్థనల వ్యవహారం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. అసలు ఈ సదస్సుకు ఎక్కడెక్కడ్నుంచి వచ్చారో..?

ఢిల్లీ ‘నిజాముద్దీన్’ వ్యవహారాన్ని బయటపెట్టిందెవరంటే..!?

భారత్‌లో లాక్‌డౌన్ విధించడంతో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కొలిక్కి వస్తుందని భావిస్తున్న సమయంలో ఢిల్లీ నిజాముద్దీన్‌ వ్యవహారంతో ఉలిక్కిపడింది.

ఢిల్లీకి వెళ్లింది నిజమే కానీ...: ఏపీ డిప్యూటీ సీఎం సవాల్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా ఢిల్లీలోని నిజాముద్ధీన్ ప్రాంతంలో జరిగిన మర్కాజ్ సమావేశాలకు వెళ్లారని.. ఆ మరుసటి రోజే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిశారని మంగళవారం

మ‌హేశ్ వ‌ర్సెస్ విజ‌య్ ..ట్విట్ట‌ర్ వార్‌

సోష‌ల్ మీడియా పెరిగిన త‌ర్వాత హీరోలు అభిమానులకు చేరువ‌య్యారు. అలాగే ఫ్యాన్స్ మ‌ధ్య వార్స్ కూడా ఎక్కువ‌య్యాయి. మా హీరో గొప్ప అంటే కాదు..