క‌రోనా ప్ర‌భావం... క‌త్రినా అలా! కాజ‌ల్ ఇలా

  • IndiaGlitz, [Tuesday,March 24 2020]

క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినీ రంగం అంతా స్త‌బ్ద‌త నెల‌కొంది. షూటింగ్స్ బంద్ అయ్యాయి. సినీ తార‌లంద‌రూ ఇంటికే ప‌రిమిత‌మైయారు. ప‌లువురు ప‌లు ర‌కాలుగా స‌మ‌యాన్ని వెల్ల‌దీస్తున్నారు. వైర‌స్ భ‌యంతో ప‌ని వాళ్ల‌ను కూడా ఇంట్లోకి రానీయ‌డం లేదు. ఎవ‌రికి వారే ప‌నులు చేసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రికా కైఫ్ విష‌యానికి వ‌స్తే ఈమె త‌న ఇంటిని తానే శుభ్రం చేసుకుంటుంది. ముఖ్యంగా ఆమె అంట్లు తోమె వీడియో ఒక‌టి విడుద‌ల చేసింది. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

పాత్ర‌ల‌న్నింటికీ ఒకేసారి సోపు వేసి.. త‌ర్వాత వాట‌ని కాసేపు ఆ సోపు నీళ్ల‌లో నాన్చి త‌ర్వాత క‌డగ‌డం వ‌ల్ల నీరు ఆదా అవుతుంది. అలాగే స‌మ‌యం కూడా ఆదా అవుతుంద‌ని క‌త్రినా త‌న వీడియోలో చెప్ప‌డం విశేషం. ఇక అందాల చంద‌మామ కాజ‌ల్ అయితే త‌న‌కు ఖాళీగాఉండ‌టం ఇష్టం ఉండ‌ద‌ని కాబ‌ట్టి తాను కొత్త విష‌యాలు నేర్చుకోవ‌డానికి ప్రాధాన్య‌త ఇస్తాన‌ని అంటుంది. ప్ర‌స్తుతం చెస్ ఆట‌తో పాటు మార్ష‌ల్స్ ను నేర్చుకుంటోందట కాజ‌ల్‌. ఖాళీ స‌మ‌యంలో మ‌రింత ప్రావీణ్య‌త సంపాదించుకోవ‌చ్చున‌ని మ‌నం నేర్చుకునే కొత్త ప‌నులు జీవితంలో ఉప‌యోగ‌ప‌డుతాయా, లేవా అని ఆలోచించ‌న‌ని కేవ‌లం నేర్చుకోవ‌డ‌మే త‌న‌కు తెలుసున‌ని ఆమె చెప్పుకొచ్చింది.

More News

షాకింగ్.. చైనాలో మరో ప్రాణాంతక వైరస్..!

చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచం నలువైపులా విసర్తిరించడంతో ఈ మహమ్మారి దెబ్బకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే పలు దేశాలు దాటేసిన ఈ వైరస్ ఎప్పుడు ఎవర్ని సోకుతుందో..?

కరోనాపై ఆందోళన వద్దు.. పారాసిట్‌మాల్‌ వేసుకోండి!

కరోనాపై ఆందోళన వద్దని.. పారాసిటిమాల్ వేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్ ప్రకటించారు. కాగా ఇదివరకే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇదివరకే పారాసిటిమాల్, బ్లీచింగ్ పౌడర్

కరోనా నేపథ్యంలో దేశ ప్రజలకు నిర్మలమ్మ శుభవార్త!

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆ వైరస్ కట్టడికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి దేశ ప్రజలకు ఆర్థిక మంత్రి

కరోనాపై యుద్ధం.. విరాళాలు ప్రకటిస్తున్న ప్రముఖులు

కరోనా వైరస్ ప్రపంచాన్ని కాటేస్తున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు సాయం చేసి పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ చేయడం.. మరోవైపు ప్రజా రవాణా బంద్ చేసిన సంగతి తెలిసిందే.

భారత్‌‌లో కరోనా పరిస్థితి ఎలా ఉందంటే..

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వేలాది మంది చనిపోగా.. లక్షలాది మంది అనుమానితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.