close
Choose your channels

క‌రోనా దెబ్బ‌..వాయిదా వేసుకున్న నాగ్‌!

Thursday, February 6, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క‌రోనా దెబ్బ‌..వాయిదా వేసుకున్న నాగ్‌!

ప్ర‌పంచం అంతా క‌రోనా ఎఫెక్ట్‌తో భ‌య‌ప‌డుతుంది. ఈ ఎఫెక్ట్ కార‌ణంగా ప్ర‌జ‌లు వేరే ప్ర‌దేశాల‌కు వెళ్లాలంటే భ‌య‌ప‌డుతున్నారు. సినీ రంగం విష‌యానికి వ‌స్తే ..అలా క‌రోనా ఎఫెక్ట్‌తో భ‌య‌ప‌డ్డ వైల్డ్ డాగ్ యూనిట్ ఓ నిర్ణ‌యం తీసుకుంది. వివ‌రాల్లోకెళ్తే.. నాగార్జున హీరోగా సాల్మోన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `వైల్డ్ డాగ్‌`. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ను థాయ్‌లాండ్‌లో చేయాల‌నుకున్నారు. కానీ క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా షెడ్యూల్‌ను వాయిదా వేసిన‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ నుండి ఎలాంటి స్పంద‌న లేదు.

మ‌న్మ‌థుడు 2 త‌ర్వాత నాగార్జున చేస్తున్న చిత్ర‌మిది. రొటీన్‌కు భిన్నంగా నాగార్జున ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో నాగ్‌..ఎన్ఐఏ ఆఫీస‌ర్‌గా..ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌గా న‌టిస్తున్నారు. అలాగే హీరోయిన్ స‌యామీఖేర్ కూడా ఇందులో యాక్ష‌న్ రోల్‌లో న‌టిస్తుంది. స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంద‌ని టాక్‌. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.