కరోనా ఎఫెక్ట్.. పద్మ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా

  • IndiaGlitz, [Saturday,March 14 2020]

పద్మ అవార్డుల ప్రదానోత్సవంపై కరోనా ప్రభావం పడింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తుండటంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని కేంద్ర హోం శాఖ ప్రకటించింది. కాగా.. ఏప్రిల్-3న రాష్ట్రపతి భవన్‌లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే.. భారత్‌లో కరోనా వ్యాప్తిచెందుతుండటం.. రోజుకురోజుగా పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండటం.. మరోవైపు అనుమానితులు కూడా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో హోం శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాగా.. అవార్డుల ప్రదానోత్సవం తదుపరి ఎప్పుడనేది ఉత్వర్వులు వచ్చే వరకూ వాయిదా వేశారు. ఈ మేరకు అవార్డు గ్రహితలకు సమాచారం కూడా పంపడం జరిగింది.

పద్మ అవార్డు గ్రహితలు వీరే..

71వ గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని 2020వ సంవత్సరానికిగాను ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మభూషణ్, 118 మందికి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. తెలంగాణ నుంచి ముగ్గురు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇద్దరిని ఈ పద్మ అవార్డులు వరించాయి. తెలంగాణ నుంచి క్రీడా విభాగంలో పీవీ సింధుకు పద్మ భూషణ్‌ను ప్రకటించగా.. వ్యవసాయ రంగంలో తెలంగాణకు చెందిన చింతల వెంకట్ రెడ్డికి పద్మశ్రీ , విద్య-సాహిత్య రంగాల్లో విశేష సేవలు అందించిన విజయసారధి శ్రీభాష్యంకు పద్మశ్రీ అవార్డు వరించాయి. కళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యడ్ల గోపాల రావు, దలవాయి చలపతి రావులకు పద్మశ్రీ పురస్కారాలు దక్కిన సంగతి తెలిసిందే.

More News

బ్రేకింగ్ : తెలంగాణలో థియేటర్స్, స్కూల్స్, మాల్స్ బంద్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా తెలుగు రాష్ట్రాలకు పాకిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఉగాది పచ్చడి లాంటి తెలుగు చిత్రం 'అన్నపూర్ణమ్మ గారి మనవడు' - కళాతపస్వి కె.విశ్వనాథ్

తెలుగు సినీ చరిత్రలో గాని, తెలుగు సినిమా పరిశ్రమలో కానీ సువర్ణ అక్షరాలతో లిఖించ దగిన దర్శకులు ఎవరైనా ఉన్నారంటే అది కళాతపస్వి, తెలుగు సినీసువర్ణ దిగ్గజ దర్శకులు,

యాంక‌ర్ ర‌వి హీరోగా న‌టిస్తోన్న‌'తోట‌బావి' టీజ‌ర్ ని విడుద‌ల చేసిన దర్శకుడు ఎన్. శంకర్

యాంక‌ర్ ర‌వి హీరోగా గౌత‌మి హీరోయిన్ గా  గ‌ద్వాల్ కింగ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జోగులాంబ క్రియేష‌న్స్ ప‌తాకంపై

థియేట‌ర్స్ మూసివేత‌పై నిర్మాత‌ల మండ‌లి చ‌ర్చ‌

ప్ర‌పంచం అంతా క‌రోనా వైర‌స్ ధాటికి భ‌య‌ప‌డుతుంది.

ఈ నెల 20న వస్తోన్న సోషియో ఫ్యాంటసీ చిత్రం ‘అంగుళీక’!!

ఆరువందల ఏళ్ల క్రితం జరిగిన ఓ యాథార్థ సంఘటన ఆధారం చేసుకుని సినిమాకు తగ్గట్టుగా కొన్ని కల్పిత పాత్రలతో తెరకెక్కిన సోషియో  ఫ్యాంటసీ చిత్రమే ‘అంగుళీక’.