close
Choose your channels

నితిన్ సినిమా బిజినెస్‌కు క‌రోనా ఎఫెక్ట్‌

Friday, April 3, 2020 • తెలుగు Comments

నితిన్ సినిమా బిజినెస్‌కు క‌రోనా ఎఫెక్ట్‌

యువ క‌థానాయ‌కుడు నితిన్‌.. ఏడాదిన్న‌ర గ్యాప్ త‌ర్వాత చేసిన `భీష్మ`తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద హిట్ కొట్టాడు. ఈ గ్యాప్‌లో నితిన్ నాలుగు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు. అందులో ముందుగా వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న రంగ్ దే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమాలో కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. భీష్మ హిట్ కావ‌డంతో రంగ్ దేకు మంచి బిజినెస్ ఆఫ‌ర్స్ ద‌క్కాయి. ముఖ్యంగా శాటిలైట్, డిజిట‌ల్ హ‌క్కుల‌కు క‌లిపి ప్ర‌ముఖ జీ ఛానెల్ 10 కోట్ల రూపాయ‌ల‌ను ఇవ్వ‌డానికి రెడీ అయ్యింది. అయితే నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ రూ.12 కోట్లు కావాల‌నుకున్నాడు. డీల్ 11 కోట్ల‌కు ఓకే అయ్యింది. ఈ సమ‌యంలో క‌రోనా ఎఫెక్ట్‌తో అన్ని ప‌నులు హోల్డ్ ప‌డ్డాయి. దీంట్లో రంగ్ దే బిజినెస్ డీల్ కూడా హోల్డ్‌లో ప‌డింది.

ఈ సినిమా త‌ర్వాత నితిన్ త‌న నిర్మాణంలో బాలీవుడ్ చిత్రం అంధాదున్ రీమేక్‌లో న‌టించ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు. కాగా.. చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ థ్రిల్ల‌ర్ చిత్రంలోనూ న‌టించ‌బోతున్నాడు . ఇవీ రెండు కాకుండా కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది.

Get Breaking News Alerts From IndiaGlitz