యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా..

  • IndiaGlitz, [Thursday,December 24 2020]

తెలంగాణలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. తెలంగాణలో కేసుల సంఖ్య పెరిగాయా? తగ్గాయా? అనే విషయాలను పక్కనబెడితే.. యూకే నుంచి వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం భయాందోళనలను రేకిత్తిస్తోంది. యూకే సుంచి తెలంగాణకు 1200 మంది వచ్చిన విషయం తెలిసిందే. వారిలో ఇప్పటి వరకూ 846 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఏడుగురికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఆ ఏడుగురిలో జగిత్యాల 2, వరంగల్ 1, హైదరాబాద్ 2, మేడ్చల్ 1, సిద్దిపేటలో ఒకరికి కరోనా సోకినట్లు వైద్యులు ప్రకటించారు.

అయితే కరోనా సోకిన వారిని రెండవ దశ అనుమానిత పాజిటివ్ కేసులుగా నమోదు చేశారు. జీన్ మ్యాపింగ్ టెస్టుల కోసం ఏడుగురి శాంపిల్స్ సీసీఎంబీకి వైద్యులు పంపారు. రెండు రోజుల్లో జీన్ మ్యాపింగ్ రిపోర్టులు వచ్చే అవకాశం ఉంది. అవి వస్తే కానీ వారి పరిస్థితి ఏంటనేది తెలియదు. కాగా.. యూకే నుంచి తెలంగాణకు 1,200 మంది ప్రయాణికుల్లో అధిక శాతం మంది జీహెచ్ఎంసీ పరిధిలోనే వారే కావడం గమనార్హం. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 800 మంది యూకే నుంచి వచ్చినట్టు అధికారులు గుర్తించారు.

కాగా.. ఇతర జిల్లాల్లో సైతం యూకే వెళ్లొచ్చిన వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల యూకే నుంచి కరీంనగర్, ఆదిలాబాద్‌కు పలువురు వచ్చినట్లు తెలుస్తోంది. బ్రిటన్ నుంచి కరీంనగర్‌కు 16 మంది వచ్చినట్టు తేలిందని అధికారులు చెబుతున్నారు. వీరిలో ఇప్పటికే 10 మంది శాంపిల్స్‌ను అధికారులు తీసుకున్నారు. మరో ఆరుగురి ఆచూకీ కోసం అధికారులు యత్నిస్తున్నారు. యూకే నుంచి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన 12 మంది నుంచి శాంపిల్స్ తీసుకుని హైదరాబాద్‌కు వైద్యులు పరీక్షల నిమిత్తం పంపారు.

More News

సాయితేజ్‌ నూతన చిత్రం ప్రారంభం

వైవిధ్యమైన చిత్రాలతో కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును, సాధించుకున్న సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌

వచ్చే వారం కరోనా టీకాకు.. కేంద్రం అనుమతి!

కరోనా నుంచి విముక్తి కల్పించేందుకు పలు సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రానున్నాయి.

పరిస్థితుల్ని పాట రూపంలో చెప్పిన ఆదివాసీలు.. చలించిపోయిన పవన్

మూడేళ్ల అనంతరం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలకు కాస్త విరామమిచ్చి సినిమాలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే.

అభిజీత్ కంటే ముందుగా..వెండితెర‌పైకి సోహైల్ ..!

బిగ్‌బాస్ 4లో అభిజీత్ విన్న‌ర్‌గా, అఖిల్ రన్న‌ర్‌గా నిలిచిన‌ప్ప‌టికీ మూడో స్థానంలో నిలిచిన సోహైల్ ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు అందుకున్నాడు.

మరో ప్రమాదకరమైన మహమ్మారి గుర్తింపు..

కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రపంచాన్ని వణికిస్తుంటే అంతకంటే ప్రమాదకరమైన మరో రకం కరోనా వైరస్‌ను గుర్తించినట్టు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) ఆరోగ్యశాఖ మంత్రి మ్యాట్‌ హ్యాన్‌కాక్‌ బుధవారం వెల్లడించారు.