ఎన్నికల బరిలో కరోనా..

  • IndiaGlitz, [Friday,November 20 2020]

టైటిల్ చూడగానే.. ఓహో ఎన్నికల్లో పోటీ చేసే వారు ప్రచారం పేరుతో తమ అనుచరలతో హల్ చల్ చేస్తున్నారు కాబట్టి ఇంకేంముంది కరోనా విజృంభిస్తోంది అందుకే అలా టైటిల్ ఇచ్చి ఉంటారని భావిస్తూ ఉండొచ్చు. లేదంటే రకరకాల ఆలోచనలు మనసులో మెదిలి ఉండొచ్చు. కానీ ఇదొక ఆసక్తికరమైన విషయం. ఈ న్యూస్ తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించింది. కాదు. కేరళలో వచ్చే నెలలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించింది.

కరోనా అంటే వైరస్ కాదు.. ఎన్నికల్లో పోటీ చేయబోయే మహిళ పేరు. ఆమె పూర్తి పేరు కరోనా థామస్. కేరళలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొల్లాం కార్పొరేషన్ పరిధిలోని మథిలిన్ వార్డు నుంచి బీజేపీ తరుఫున ఆమె పోటీ చేస్తున్నారు. కొల్లాంకు చెందిన థామస్ ఫ్రాన్సిస్ అనే వ్యక్తికి ఇద్దరు కవల పిల్లలుగా ఒక పాప, బాబు జన్మించారు. వారికి వినూత్నంగా పేరు పెట్టాలని ఆయన భావించారు. ఈ క్రమంలో బాబకు ‘కోరల్’ అని.. పాపకు ‘కరోనా’ అని నామకరణం చేశారు. ఇప్పుడు ఈ కరోనాయే కేరళలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోతోంది.

More News

ఢిల్లీ నుంచి బయటకు వెళ్లాలని సోనియాకు వైద్యుల సూచన..

దేశ రాజధాని ఢిల్లీ నుంచి బయటికి వెళ్లాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వైద్యులు సూచించినట్లు సమాచారం.

ఫిబ్రవరిలో కరోనా వ్యాక్సిన్: సీరం సంస్థ

ఆస్ట్రాజెనికా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి సీరం సంస్థ సంయుక్తంగా కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే.

56 మందితో బీజేపీ నాలుగో జాబితా విడుదల..

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయడంలో పార్టీలన్నీ తలమునకలై ఉన్నాయి.

జీహెచ్‌ఎంసీలో రెండో రోజు 580 నామినేషన్ల దాఖలు..

జీహెచ్ఎంసీ ఎన్నికలకు శుక్రవారం చివరి రోజు కావడంతో బెర్త కన్ఫర్మ్ అయిన నేతలంతా నామినేషన్స్ దాఖలు చేసేస్తున్నారు.

18 డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్..

హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ పార్టీ సైతం సన్నద్ధమవుతోంది.