ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ ఒక్కరోజే..

  • IndiaGlitz, [Thursday,July 09 2020]

ఏపీలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ నేడు కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 16,882 శాంపిల్స్ పరీక్షించగా 1555 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రానికి చెందిన 1500 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 53 మందికి.. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 23814కు చేరింది.

గడచిన 24 గంటల్లో 13మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 277కి చేరుకుంది. కాగా నేడు 904 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా ప్రస్తుతం 11383 యాక్టివ్ కేసులుండగా. 12154 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఇప్పటి వరకూ 10 లక్షల 94 వేల 615 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

‘తాగిన మత్తులో..’ అంటూ శ్రియ ఫోటో షేర్ చేసిన నిర్మాత

రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రీ కొస్చీవ్‌ను పెళ్లి చేసుకుని ప్రశాంతంగా జీవిస్తున్న హీరోయిన్ శ్రియ సంసారంలో నిప్పులు పోసేలా ఉంది

కోలుకుంటున్న సీనియర్ నటి జయంతి

సీనియర్ నటి జయంతి కాస్త కోలుకున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆమెకు కరోనా టెస్ట్ నిర్వహించగా నెగిటివ్ అని ఫలితం వచ్చినట్టు వైద్యులు తెలిపారు.

జగన్ నిర్ణయానికి ఎదురు నిలిచిన వైసీపీ ఎమ్మెల్యే.. స్పీకర్ మద్దతు

ఏపీ సీఎం జగన్ చాలా మొండివారనేది జగమెరిగిన సత్యం. ఏదైనా కమిట్ అయితే ఆయన మాట ఆయనే వినరనే టాక్ తెలుగు రాష్ట్రాల్లో ఉంది.

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబె అరెస్ట్

కాన్పూర్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబేను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

తెలంగాణలో నిన్న భారీగా కేసులు.. ఉపశమనం కలిగించే అంశమిదే

తెలంగాణలో రోజురోజుకూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం కరోనా కేసుల వివరాలను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.