తెలంగాణలో ఊహించని రీతిలో కరోనా కేసులు నమోదు

  • IndiaGlitz, [Monday,June 01 2020]

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఉధృతి తెలంగాణలో ఇప్పట్లో తగ్గేలా లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ.. అది కూడా హైదరాబాద్‌ లాంటి సిటీలో భారీగా కేసులు నమోదవుతుండటం రాష్ట్ర ప్రజానికానికి కలవరపాటుకు గురిచేసే విషయం. మే నెల మొదట్లో పదుల సంఖ్యలో నమోదయిన కేసులు చివరి వారంలో మాత్రం వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. మే-31న ఒక్కరోజే ఊహించని రీతిలో కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 199 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మీడియా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కొత్తగా నమోదైన ఈ కేసులతో కలిపితే మొత్తం కేసుల సంఖ్య 2698కి చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే ఐదుగురు మరణించగా.. మొత్తం మరణాల సంఖ్యకు 82కు చేరింది.

కాగా.. ఇవాళ నమోదైన 199 కేసుల్లో 122 జీహెచ్ఎంసి పరిధిలోవే. రంగారెడ్డి-40, మహబూబ్ నగర్‌-03, మేడ్చల్-10, ఖమ్మం-09 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో కేసులు 122 నమోదుకావడంతో నగరవాసులు బిక్కి బిక్కిమంటున్నారు. ఇదిలా ఉంటే.. గత కొన్ని వారాలుగా కరోనా కేసులు చూడని జిల్లాల్లోనూ ఈసారి కేసులు రావడం తెలంగాణ యంత్రాంగాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 12 జిల్లాల్లో మాత్రం గడిచిన 14 రోజులుగా ఒక్క కేసూ నమోదు కాలేదు. హైదరాబాద్‌లో సడలింపులు ఎక్కువగా ఇవ్వడం, ఇష్టానుసారం జనాలు తిరిగేయడంతో నగరం మొత్తం కరోనా వ్యాపించేసింది. మరోవైపు అధికారులు ఎన్నో నియంత్రణా చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా కంట్రోల్ కావట్లేదు. కాగా మున్ముంథు కేసులు పెరుగుతాయే తప్ప తగ్గే పరిస్థితి లేదని మాత్రం నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు.

More News

మహేశ్-పూరీ కాంబోలో సినిమా కష్టమేనా!?

సూపర్ స్టార్ మహేశ్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇందుకు ‘పోకిరి’, ‘బిజినెస్‌మెన్’ లాంటి సినిమాలే నిదర్శనం.

‘బుట్ట‌బొమ్మ‌..’  మ‌రో రికార్డ్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం ‘అల వైకుంఠ‌పుర‌ములో’. ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను సాధించింది.

లాక్ డౌన్ 5.0 : దశల వారీగా వీటికి మాత్రమే అనుమతి

కరోనా వ్యాప్తి నియంత్రణలోకి రాకపోవడంతో మరోసారి లాక్ డౌన్‌ (5.0)ను పొడిగించిన విషయం తెలిసిందే. కంటైన్మెంట్ జోన్లను పరిగణనలోకి తీసుకుని దేశంల లాక్ డౌన్‌ను జూన్ 30 వరకు పొడిగించిన కేంద్రం,

లాక్ డౌన్ 5.0 : అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఎత్తివేత

న్యూ ఢిల్లీ : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం జూన్-30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

జూన్-30 వరకు 5.0 లాక్ డౌన్

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరోసారి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను పొడిగించింది.