తెలంగాణలో విశ్వరూపం చూపించిన కరోనా.. నిన్న ఒక్కరోజే...

  • IndiaGlitz, [Saturday,July 04 2020]

తెలంగాణలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. మొన్నటి వరకూ 1200 దాటని కరోనా కేసులు నిన్న దాదాపు 1900 కేసులు నమోదవడంతో తెలంగాణ ప్రజలు షాక్ అయ్యారు. 5962 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 1892 కేసులు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,462కు చేరుకుంది.

కరోనా కారణంగా నిన్న ఒక్కరోజే ఎనిమిది మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా మృతుల సంఖ్య 283కు చేరుకుంది. కాగా తెలంగాణలో 9984 యాక్టివ్ కేసులుండగా.. 10వేల 195 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 1658 కేసులు నమోదవడం గమనార్హం.

More News

ఆ అందమైన ప్రేమకథకు హీరోగా రఘు కుంచె...

ఇప్పటికే ‘పలాస 1978’ చిత్రం ద్వారా ఓ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రఘు కుంచె హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది.

పవన్ ట్వీట్.. ఏపీకి ప్రశంస.. తెలంగాణకు చురక!

అధికార పక్షంలో ఉన్నామా? ప్రతిపక్షంలో ఉన్నామా? అనేది పక్కన బెడితే ప్రజా నాయకుడికి మంచిని మంచిగా ఒప్పుకున్నప్పుడే విలువ, గౌరవం ఉంటాయి.

ఎన్టీఆర్‌తో ఢీ కొట్ట‌డానికి మంచు హీరో ఒప్పుకుంటాడా?

కరోనా ప్రభావంతో ఏర్ప‌డ్డ లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్స్ బంద్ కావ‌డం.. షూటింగ్స్ ఆగిపోయాయి. రెండు నెల‌లు త‌ర్వాత షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి.

నా మొద‌టి కొరియోగ్రాఫ‌ర్ స‌రోజ్ ఖాన్ మృతి న‌న్ను బాధిస్తోంది - అల్లు అర్జున్

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో 'మాస్టర్ జీస‌, 'మదర్ ఆఫ్ కొరియోగ్రఫీ' అని అంతా ప్రేమగా పిలిచే  ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ గుండె పోటుతో శుక్రవారం క‌న్ను మూసిన సంగతి తెలిసిందే.

మోదీ లద్దాఖ్ పర్యటనపై పరోక్షంగా స్పందించిన చైనా..

లద్దాఖ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా పర్యటించి సైనికుల్లో ఉత్సాహాన్ని నింపిన విషయం తెలిసిందే.