షాకింగ్ కేరళలో గర్భిణికి కరోనా పాజిటివ్

  • IndiaGlitz, [Thursday,April 02 2020]

కరోనా మహమ్మారి బారిన పడిన బాధితుల సంఖ్య దేశ వ్యాప్తంగా గంటగంటకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా కేరళ విషయానికొస్తే.. ఇప్పటివరకూ మొత్తం 286 పాజిటివ్ కేసులు తేలాయి. కాగా కోల్లాం జిల్లాలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. కేవలం ఈ ఒక్క జిల్లాలోనే కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం గమనార్హం. కాగా.. ఇవాళ జరిపిన కరోనా టెస్ట్‌ల్లో గర్భిణీ కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో జిల్లాలో గర్భిణీ సహా 21 మంది కరోనా సోకినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఓ ప్రకటనలో తెలిపారు. కేరళలో తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో గర్భిణీ కూడా ఉండటంతో కుటుంబ సభ్యులు, అధికారులు సైతం షాకయ్యారు. మరోవైపు కాసర్గోడ్ జిల్లా నుంచి 08, ఇడుక్కి నుంచి 05, కొల్లం నుంచి 20, తిరువనంతపురం, పతనమిట్ట, మలప్పురం, త్రిస్సూర్లలో ఒక్కొక్కటి మాత్రమే నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. 50 ఏళ్లకు పైబడిన వారే కరోనా రోగులు ఉన్నారన్న విషయం తెలిసిందే. అయితే.. కేరళలో 93 ఏళ్ల వృద్ధుడు కరోనాను జయించాడు. ఆరోగ్యకరమైన జీవన శైలే ఆయన తిరిగి కోలుకోవడానికి కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు.

షాకిచ్చిన హైకోర్టు!

మరోవైపు.. మద్యపాన బానిసల పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకు కేరళ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. డాక్టర్ చీటీ ఉంటే మద్యం అమ్మాలని కేరళ సీఎం పినరయి విజయన్ ఆదేశించగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ఉద్యమకారులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రతినిధులు హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో.. మూడు వారాల పాటు ఎలాంటి మద్యం అమ్మకాలు జరపరాదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇది ఒక రకంగా చూస్తే.. ప్రభుత్వానికి షాకేనని చెప్పుకోవచ్చు.