close
Choose your channels

కరోనా నుంచి భారత్ కోలుకుంటున్నట్లేనా!?

Wednesday, May 20, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కరోనా నుంచి భారత్ కోలుకుంటున్నట్లేనా!?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి థాటి నుంచి ఇండియా కోలుకుంటుందా..? ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా కాసింత మెరుగుపడుతోందా..? గత కొన్నిరోజులుగా నమోదైన కేసులు.. డిశ్చార్జ్ అయిన కేసులే ఇందుకు నిదర్శనమా..? అంటే తాజాగా కేంద్ర ప్రకటనలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమనిపిస్తోంది. ఇంతకీ కేంద్రం ఏమని చెబుతోంది..? భారత్ కోలుకుంటోంది అనడంలో ఎంతవరకు నిజముంది..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఈ రెండు ఘటనలే లేకుంటే..!
ఇతర దేశాలతో పోలిస్తే మొదట్లో ఇండియా చాలా అలెర్టుగానే ఉంది. ఇతర దేశాల నుంచి వచ్చిన.. మర్కజ్ ఘటన జరగకుండా ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఈ రెండింటి దెబ్బకు ఇప్పటికీ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ప్రపంచ దేశాలు మొదలుకుని ఇండియా కూడా వ్యాక్సిన్ కనుగొనలేకపోయింది. కరోనా లక్షణాలున్నప్పుడు గానీ అనుమానం వచ్చినప్పుడు వస్తే టెస్ట్‌లు చేసి పాజిటివ్ అయితే ఐసోలేషన్.. నెగిటివ్ అయితే మాత్రం క్వారంటైన్‌కు పంపుతున్నారు. ఇలా మొదటి స్టేజ్‌లో వచ్చినవారు చాలావరకు కరోనాను జయించి ఇంటికెళ్తున్నారు. ఎవరికైతే కరోనాతో పాటు ఇదివరకే జబ్బులున్నాయో వాళ్లందరూ దాదాపు మరణాలే..! మరీ ముఖ్యంగా 60 ఉళ్లు పైబడిన వారికి అయితే మరణమే.. అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇప్పటి వరకూ మరణించిన వారు కూడా చాలా వరకు వీళ్లే..!

మనం బెటరే..!
ఇక రోజు మాదిరిగానే ఇవాళ కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మీడియాకు హెల్త్ బులెటిన్‌ను రిలీజ్ చేసింది. కేంద్ర వైద్యఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియా ముందుకొచ్చి భారత్‌లో నమోదైన కేసులు, రికవరీ రేటు గురించి వివరిస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు. ‘ కరోనా వైరస్ కట్టడికి తీవ్రంగా కృషి చేస్తున్నాం. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మనం కొంచెం బెటర్. భారత్‌లో ఇప్పటివరకూ 42,298 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్‌లో 61,149 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రపంచ మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుంటే లక్ష మందిలో 62 మంది కరోనా బారిన పడ్డారు. అదే భారత్‌లో.. లక్షకు 8 మందికి మాత్రమే కరోనా సోకినట్లు తేలింది. భారత్‌లో లాక్‌డౌన్ అమలైన కొత్తలో రికవరీ రేటు 7% ఉంది. అదే ఇప్పుడు 39.6 శాతానికి పెరిగింది. లాక్‌డౌన్-01 నాటికి 7.1 శాతం, లాక్‌డౌన్ 2.0 నాటికి 11.42 శాతం, లాక్‌డౌన్ 3.0 నాటికి 26.59 శాతంగా ఉన్న రికవరీ రేటు లాక్‌డౌన్ 4.0 నాటికి 39.62 శాతానికి పెరిగింది’ అని లవ్ అగర్వాల్ మీడియాకు వెల్లడించారు. మొత్తానికి చూస్తే మునుపటితో పోలిస్తే కాస్త బెటరే అన్న మాట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.