కరోనా పాటల ఆల్బమ్ ను ఆవిష్కరించిన వి .వి .వినాయక్

కరోనా రక్కసి కరాళ నృత్యాన్ని చూసి ప్రపంచ పటమే భయంతో వణికి పోతున్న నేపధ్యంలో ప్రజలను చైతన్యం చేసే లక్ష్యంతో రూపొందిన కరోనా రక్కసి అనే పాటల ఆల్బమ్ ను ప్రముఖ సినీ దర్శకులు వి .వి .వినాయక్ ఈనెల 16 వ తేదీన ఆవిష్కరించారు. అభ్యుదయ సినీ దర్శకుడు బాబ్జీ రచించిన యీ పాటలను ప్రజా నాట్యమండలి గాయకుడు లక్ష్మణ్ పూడి ఆలపించారు. యువ సంగీత దర్శకుడు ప్రేమ్ స్వరాలను అందించారు.

ఈ సంధర్భంగా వి .వి .వినాయక్ మాట్లాడుతూ కరోనా రక్కసి విభృంజన ను చూసి జనమంతా విపరీతంగా భయపడి పోతున్నారని, కానీ మనం చేయవలసినది భయపడడం కాదు, జాగ్రత్తలు తీసుకోవడం అని , యీ విపత్తు సమయంలో ఆర్ధికంగా బలంగా వున్న వ్యక్తులందరూ ఆర్ధికంగా బలహీనంగా వున్న పేద సాదలకు అండగా నిలబడి మానవత్వాన్ని చాటాలని పేర్కొంటూ, ప్రజలను చైతన్య పరిచేందుకై యీ పాటల ఆల్బమ్ ను రూపొందిన బాబ్జీ లక్ష్మణ్ పూడి గార్లను అభినందించారు....!

దర్శక రచయిత బాబ్జీ మాట్లాడుతూ సమాజం లో ఏ విపత్తు వచ్చినా స్పందించడం, ప్రజల పక్షాన నిలబడడం కళాకారుల బాధ్యత అని, ఆ బాధ్యత తోనే యీ పాటలను రూపొందించామని అన్నారు.

ప్రజా నాట్యమండలి గాయకుడు , ఈ పాటల ఆల్బమ్ రూపకర్త లక్ష్మణ్ పూడి మాట్లాడుతూ లాక్ డౌన్ ఎత్తి వేసిన తరువాత ప్రజలలో నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుందని, ఎవరికి వాళ్ళు మాకు ఏమి కాదు అనే భావన తో బయట తిరుగుతున్నారని, అలాంటి జనాన్ని చైతన్యపరచడానికే యీ పాటలను రూపొందించామని తెలిపారు.

More News

గోపీచంద్‌తో మ‌రో స్టార్ హీరోయిన్‌..?

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ తేజ ... ఒక‌ప్పుడు చిత్రం, నువ్వు నేను, జ‌యం వంటి  ప్రేమ‌క‌థా చిత్రాల‌తో వ‌రుస విజయాల‌ను అందుకున్నాడు.

అబ్బాయ్ త‌ర్వాత బాబాయ్‌తో ....

యువ క‌థానాయ‌కుడు న‌వీన్‌చంద్ర కేవ‌లం హీరోగానే కాకుండా కీల‌క‌మైన పాత్ర‌ల్లోనూ న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నాడు.

రెమ్యున‌రేష‌న్స్ విష‌యంలో కీర్తి ఆలోచ‌న‌

కరోనా ప్రభావంతో చాలా రంగాలు నష్టపోయాయి. అలా నష్టపోయిన రంగాల్లో సినీ పరిశ్రమ కూడా ఉంది.

40 ఏళ్లలో తొలిసారి.. ఆస్కార్స్ వాయిదా

ప్రపంచ సినిమాలో ఆస్కార్ అవార్డుల‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. ఈ అవార్డుల‌ను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తుంటారు.

'ఫ్యామిలీ ప్యాక్' మోషన్ పోస్టర్ విడుదల

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిర్మాతగా మారి పి.ఆర్.కె ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కొంత టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు.