close
Choose your channels

తెలంగాణ కరోనా అప్‌డేట్.. ఇవాళ ఎన్నంటే..

Thursday, July 30, 2020 • తెలుగు Comments

తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాలకూ కరోనా విస్తృతంగా వ్యాపించింది. నిన్న మొన్నటి వరకూ గ్రీన్ జోన్‌లో ఉన్న జిల్లాల్లో సైతం భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా హెల్త్ బులిటెన్‌ను గురువారం తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 18,263 శాంపిళ్లను పరీక్షించగా.. 1811 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 60,717కు చేరుకుంది.

కాగా గడిచిన 24 గంటల్లో కరోనాతో 13 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 505కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,640 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ 4,16,202 శాంపిళ్లను పరీక్షించినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా.. నేడు కూడా ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 521 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 289 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Get Breaking News Alerts From IndiaGlitz