close
Choose your channels

గంగవ్వకు బిగ్‌బాస్ హౌస్‌లో కరోనా పరీక్ష..!

Friday, September 18, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గంగవ్వకు బిగ్‌బాస్ హౌస్‌లో కరోనా పరీక్ష..!

బిగ్‌బాస్ సీజన్ 4లో మోస్ట్ వాంటెడ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది గంగవ్వే. ఎన్నో కష్టాల మధ్య బతికిన ఆమె జీవితం ఈ మధ్యే ఓ మలుపు తీసుకుంది. ‘మై విలేజ్ షో’ ద్వారా ఆమె చాలా మందికి చేరువైంది. అయితే ఈ షో ప్రారంభానికి ముందే కంటెస్టెంట్‌లందరికీ కరోనా పరీక్ష నిర్వహించి.. ఆ తరువాత 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి.. మరోసారి పరీక్ష నిర్వహించిన మీదటే హౌస్‌లోకి ప్రవేశపెట్టారు. షో అంతా సవ్యంగానే సాగుతోంది. అద్భుతమైన రేటింగ్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో గంగవ్వ అనారోగ్యం పాలవడం ఒక్కసారిగా కలకలం రేపింది.

అయితే తాజాగా గంగవ్వను పరీక్షించిన వైద్యులు ఆమెకు కరోనా పరీక్షను మరోసారి చేశారని సమాచారం. షో మొదలైన తరువాతే కొందరు టెక్నీషియన్లకు కూడా కరోనా సోకినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గంగవ్వ సడెన్‌గా అనారోగ్యం పాలవడంతో ఆమెకు కరోనా పరీక్ష చేయించారట. ఫలితం మాత్రం రావాల్సి ఉంది. మరోవైపు గంగవ్వ బిగ్‌బాస్ హౌస్‌లో ఇమడలేకపోతున్నారు. ఇప్పటి వరకూ ఆమె తీసుకున్న ఆహారం, గడిపిన వాతావరణానికి ప్రస్తుతం ఆమె తీసుకుంటున్న ఆహారంతో పాటు ఉంటున్న వాతావరణం పూర్తి భిన్నమైనది కావడంతో ఆమెకు ఆ పరిస్థితుల్లో జీవించడం చాలా కష్టమైంది. ఇక మరి ఆమె కరోనా ఫలితం ఎలా రానుందో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.