2021కి 25 కోట్ల మందికి కరోనా.. 18 లక్షల మరణాలు: ఎంఐటీ

  • IndiaGlitz, [Wednesday,July 08 2020]

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కోటి పది లక్షల మంది కరోనా బారిన పడగా.. ఐదున్నర లక్షల మంది మృతి చెందారు. అయితే ఇది ఇప్పటితో ఆగదని 2021 నాటికి 25 కోట్లకు చేరుతుందని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు తెలిపారు. మరణాల సంఖ్య కూడా అనూహ్యంగా పెరగనుందని.. దాదాపు 18 లక్షల మంది కరోనాతో మరణించే ప్రమాదముందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే కరోనా నుంచి కాపాడుకోవడానికి వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కులు ధరించడం వల్లనే సాధ్యమని తెలిపారు. మార్చి నుంచే కరోనా టెస్టులు నిర్వహించి.. అవసరమై జాగ్రత్తలు పాటించి ఉంటే కేసుల సంఖ్య తగ్గి ఉండేదని ఎంఐటీ శాస్త్రవేత్తలు తెలిపారు.

More News

ఆ వార్త‌ల్లో నిజం లేదట‌!!

పెద్ద స‌పోర్ట్ లేకుండా ఇండ‌స్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక‌రు.

బయట తెలియని కొన్ని వాస్తవాలతో ‘నాలో.. నాతో.. వైఎస్సార్’: విజయమ్మ

మాజీ ముఖ్యమంత్రి.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మ.. ఓ పుస్తకం రాశారు.

ప్ర‌భాస్ అభిమానులకు గుడ్ న్యూస్‌

బాహుబ‌లి త‌ర్వాత యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నేష‌న‌ల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన సాహో బాలీవుడ్‌, టాలీవుడ్‌లో మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధించింది.

బ‌న్నీతో మ‌రోసారి..!

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీగా పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప‌’ రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.

షాక్ కొట్టించిన కరెంటు బిల్లు.. సింగిల్ బెడ్రూంకి రూ.25 లక్షలు

తెలంగాణలో కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుందో లేదో కానీ.. బిల్లు చూస్తే మాత్రం కొట్టడం ఖాయం అనిపిస్తోంది.