టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లికి హాజరైన పలువురికి కరోనా!

  • IndiaGlitz, [Wednesday,August 12 2020]

కరోనా వివాహ వేడుకలను సైతం వదలడం లేదు. ఎన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ దాని పని అది చేసుకుపోతోంది. తాజాగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఓ రూమర్ తెగ హల్‌చల్ చేస్తోంది. ఇటీవల ఓ యంగ్ హీరో వివాహం చేసుకున్నాడు. పలు మార్లు ఆ వివాహం వాయిదా పడినప్పటికీ చివరికి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ యువ కథానాయకుడు ఇటీవలే ఓ భారీ విజయాన్ని కూడా అందుకుని ఉండటంతో ఆయన డేట్స్ అవసరమనుకున్న నిర్మాతలు, దర్శకులు సహా టాలీవుడ్‌కి చెందిన కొందరు ప్రముఖ నటీనటులు ఈ వివాహానికి హాజరయ్యారు. సెల్ఫీలతో అంతా సందడి చేశారు.

కట్ చేస్తే.. పెళ్లికి వెళ్లిన పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారని సమాచారం. వివాహానికి హాజరైన సెలబ్రిటీల్లో ఒకరు టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. అంతే కాదు.. ఈ పెళ్లిలో సందడి చేసిన మరికొందరు సెలబ్రిటీలు జ్వరంతో బాధపడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరికొందరు సడీ చప్పుడు చేయక హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్టు సమాచారం. చూడబోతే సదరు హీరో వివాహం కరోనా హాట్ స్పాట్‌గా మారినట్టు తెలుస్తోంది.

కాగా హీరో పెళ్లికి హాజరైన వారిలో కనీసం ఏ ఒక్కరు కూడా మాస్క్ ధరించలేదని పెళ్లి ఫోటోలను బట్టి తెలుస్తోంది. దీంతోనే కొందరు కరోనా బారిన పడ్డారని టాక్. కరోనా విషయంలో ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా ఇబ్బందేనని దీనిని బట్టి అర్థమవుతోంది. ఏదైతే ఏమి బండ్ల గణేష్‌తో మొదలైన కరోనా టాలీవుడ్‌ని చుట్టేస్తోందనడంలో సందేహం లేదు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి కుటుంబానికి.. అనంతరం ప్రముఖ గాయకులు ఎస్పీ బాలు తదితరులకు కరోనా సోకిన విషయం తెలిసిందే.

More News

రియాకు టాలీవుడ్‌తో లింకులు.. ఆమె కాంటాక్టు లిస్ట్‌లో రానా, రకుల్

ఇటీవల మృతి చెందిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తి కాల్ రికార్డులను పరిశీలించిన అధికారులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.

దుబాయ్ డ్యూటీ ఫ్రీ గిడ్డంగి యార్డులో మంటలు.. విశేషం ఏంటంటే..

దుబాయ్ డ్యూటీ ఫ్రీ గిడ్డంగి యార్డులో సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దేవా కట్టా.. విష్ణు ఇందూరిల మధ్య రాజుకుంటున్న వివాదం

‘ప్రస్థానం’ దర్శకుడు దేవా కట్ట.. నిర్మాత విష్ణు ఇందూరిల మధ్య వివాదం రాజుకుంటోంది.

బిగ్‌బాస్ 4 వాయిదా?

తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్‌బాస్‌. తెలుగులో స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న‌ ఈ రియాలిటీ షో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సీజ‌న్స్‌ను పూర్తి చేసుకుంది.

చిరుకు ఓకే అన‌లేదు.. మ‌రి బాల‌య్య ఓకే అన్న‌ట్లేనా?

ఓ బాలీవుడ్ న‌టుడిని చిరంజీవి మ‌ల‌యాళ రీమేక్ లూసిఫ‌ర్ కోసం సంప్ర‌దిస్తే.. బిజీగా ఉన్నాను..