ఫిబ్రవరిలో కరోనా వ్యాక్సిన్: సీరం సంస్థ

  • IndiaGlitz, [Friday,November 20 2020]

ఆస్ట్రాజెనికా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి సీరం సంస్థ సంయుక్తంగా కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ సంస్థ సీఈవో అదర్ పూనావాలా వ్యాక్సిన్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. గురువారం జరిగిన హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమిట్-2020లో ఆయన మాట్లాడుతూ.. ఆక్స్‌ఫర్డ్ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను ఫిబ్రవరి 2021 నాటికి తొలుత హెల్త్‌కేర్ వర్కర్లకు, వయసు పైబడిన వారి కోసం అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. అలాగే సామాన్య ప్రజల కోసం ఏప్రిల్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని అదర్ పూనావాలా ప్రకటించారు.

యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేయడం కోసం బ్రిటన్-స్వీడన్ కంపెనీ ఆస్ట్రాజెనెకాతో పుణెకు చెందిన సీఐఐ ఒప్పందం చేసుకుంది. కాగా.. ఈ టీకాకు సంబంధించిన తుది దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఇండియాలో మొదలైన సంగతి తెలిసిందే. కాగా సీరమ్ సంస్థ మన దేశంలో ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డిసెంబర్‌లో అనుమతి చేసుకుంటుంది. జనవరిలో అనుమతులు లభిస్తే అనుకున్న సమయానికి వ్యాక్సిన్‌ను అందజేయగలుగుంది. అయితే వ్యాక్సిన్ విడుదల అనేది బ్రిటన్‌లో నిర్వహిస్తున్న క్లినికల్ ఫలితాలపై ఆధారపడి ఉంటుందని అదర్ పూనావాలా వెల్లడించారు.

కాగా.. ఈ వ్యాక్సిన్ ధరను సైతం అదర్ పూనావాలా ప్రకటించారు. వ్యాక్సిన్ రెండు డోసులకు గానూ దాదాపుగా రూ.1000 వరకూ ఉండొచ్చని పూనావాలా తెలిపారు. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి నాలుగు కోట్ల డోసులను సిద్ధం చేశామని వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ వయో వృద్ధుల్లో, యువతలో సమానంగా రోగ నిరోధక వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని సంస్థ సీఈవో తెలిపారు. నియంత్రణ సంస్థల నుంచి వెంటనే ఆమోదం లభిస్తే.. వచ్చే ఏడాది జనవరి లోపు ఈ వ్యాక్సిన్‌‌ను మార్కెట్లోకి తీసుకు వచ్చే అవకాశం ఉందని అదర్‌ పూనావాలా పేర్కొన్నారు.

More News

56 మందితో బీజేపీ నాలుగో జాబితా విడుదల..

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయడంలో పార్టీలన్నీ తలమునకలై ఉన్నాయి.

జీహెచ్‌ఎంసీలో రెండో రోజు 580 నామినేషన్ల దాఖలు..

జీహెచ్ఎంసీ ఎన్నికలకు శుక్రవారం చివరి రోజు కావడంతో బెర్త కన్ఫర్మ్ అయిన నేతలంతా నామినేషన్స్ దాఖలు చేసేస్తున్నారు.

18 డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్..

హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ పార్టీ సైతం సన్నద్ధమవుతోంది.

‘సామ్ జామ్’కు చిరు.. బాస్ ఈజ్ బ్యాక్ అంటున్న అభిమానులు

మెగాస్టార్ చిరంజీవి స్టైల్, నడక అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మెగాస్టార్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎన్నికల ప్రచారం: జనసేన

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది. ఈ మేరకు తమ పార్టీ నుంచి 45 - 60 మంది అభ్యర్థులను బరిలోకి దింపాలని యోచిస్తోంది.