భారత్‌‌లో కరోనా పరిస్థితి ఎలా ఉందంటే..

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వేలాది మంది చనిపోగా.. లక్షలాది మంది అనుమానితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు అంతకుమించి సెల్ఫ్ క్వారంటైన్‌ అనగా స్వీయ నిర్భందం విధించికుని ఇంట్లో నాలుగు గోడలకే పరిమితం అయ్యారు. ఇలా దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో అనుమానాలు సైతం పెనుభూతాలుగా మారాయి. మరోవైపు ఏ రాష్ట్రంలో ఎన్ని పాజిటివ్, ఎన్ని నెగిటివ్ కేసులు నమోదవుతున్నాయో అర్థం కాని పరిస్థితి.

ప్రపంచ వ్యాప్తంగా 382,417 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 16,569 మంది చనిపోయారు. 102,513 మంది కోలుకున్నారు. ఇక భారత్‌లో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 504కు చేరుకోగా, 37 మందికి పూర్తిగా స్వస్థత చేకూరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 457గా ఉంది. మరోవైపు.. మరణాల సంఖ్య 10కి చేరింది. మొత్తానికి చూస్తే.. పాజిటివ్, బాధితుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది.

ఈ రోజు వరకు రాష్ట్రాల వారీగా నమోదైన కేసులను పరిశీలిస్తే...

మహారాష్ట్ర - 74 కేసులు

కేరళ- 67

తెలంగాణ- 36

కర్ణాటక - 33

ఉత్తర్‌ప్రదేశ్‌- 31

గుజరాత్‌ -29

ఢిల్లీ- 29

హరియాణా- 26

రాజస్థాన్‌ - 28

పంజాబ్‌ -21

లద్దాఖ్‌ -13

తమిళనాడు-09

ఆంధ్రప్రదేశ్‌ -07

పశ్చిమబెంగాల్‌ - 07

మధ్యప్రదేశ్‌- 06

చండీగఢ్‌-06

జమ్మూకశ్మీర్‌-04

ఉత్తరాఖండ్‌ - 03

బిహార్‌-02

హిమాచల్‌ప్రదేశ్‌ -02

ఒడిశా-02

ఛత్తీస్‌గఢ్‌ -01

పుదుచ్ఛేరి-01 చొప్పున కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

More News

దిల్‌రాజుకి టెన్ష‌న్... మాటిచ్చిన పవన్ కళ్యాణ్

దిల్‌రాజు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుంది. క‌రోనా వైర‌స్‌తో ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ స్తంభించింది. థియేట‌ర్స్ మూత ప‌డ్డాయి. సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. అయితే ఈ క‌రోనా ఎఫెక్ట్ దిల్‌రాజుపై

ఏపీలో అన్ని బార్డర్లు మూసివేత.. రాకపోకలు బంద్

తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వాలు ప్రకటించిన విషయం విదితమే. మరోవైపు లాక్‌డౌన్‌ను పకడ్బందిగా అమలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు, సీఎస్‌లకు

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో 'పది' పరీక్షలు వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న పదో తరగతి పరీక్షలపై కరోనా ప్రభావం పడింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ప్రకటించిన విషయం విదితమే. కాగా.. ఈ క్రమంలో మార్చి 31 న జరగాల్సిన

కరోనాపై యుద్ధం.. తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం

కరోనా వైరస్ ప్రపంచాన్ని కాటేస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ కుర్ర హీరో నితిన్ పెద్ద మనసు చాటుకున్నాడు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ చేయడం.. మరోవైపు ప్రజా రవాణా బంద్ చేసిన సంగతి తెలిసిందే.

క్రితి శెట్టికి అవ‌కాశాల వెల్లువ

కన్న‌డ బ్యూటీ క్రితి శెట్టికి అవ‌కాశాలు వెల్తువెత్తుతున్నాయి. 2009లో క‌న్న‌డ చిత్రం ‘స‌రిగ‌మ‌’ చిత్రంతో కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ త‌ర్వాత త‌మిళంలోనూ సినిమాలు చేసింది. అక్క‌డ నుండి