కరోనా మళ్లీ మళ్లీ సోకవచ్చు: లండన్ కింగ్స్ కాలేజ్

  • IndiaGlitz, [Tuesday,July 14 2020]

కరోనా మళ్లీ సోకుతుందో.. లేదో అనే సందేహాలకు లండన్‌లోని కింగ్స్ కాలేజ్ పరిశోధనలు చెక్ పెట్టాయి. కరోనా ఒక సాధారణ జలుబు మాదిరిగా మళ్లీ మళ్లీ సోకవచ్చని పరిశోధకులు వెల్లడించారు. మన బాడీలో రోగ నిరోధక శక్తికి కారణమైనవి ప్రోటీన్లు. ఇవి యాంటీబాడీలుగా పని చేస్తాయి. కరోనాపై పోరాటంలోనూ కీలకంగా పని చేస్తాయి. అయితే ఒకసారి కరోనాకు గురైన వ్యక్తి ఆ వైరస్‌ నిరోధక శక్తిని దాదాపు మూడు నెలల వ్యవధిలోనే కోల్పోతున్నారని.. దీని ఫలితంగా మళ్లీ మళ్లీ కరోనా సోకే అవకాశముందని కింగ్స్ కాలేజ్ పరిశోధనల్లో వెల్లడైంది.

కాగా.. ఈ పరిశోధనలు.. ప్రస్తుతం వ్యాక్సిన్ తయారు చేస్తున్న తరుణంలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినప్పటికీ అది ఒకసారి వేయించుకుంటే సరిపోదని ఈ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. యాండీబాడీలు మూడు నెలల్లో తగ్గి పోతున్నాయంటే.. వ్యాక్సిన్ కూడా మూడు నెలలకోసారి వేయించుకోవాల్సిందేనని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్ కేటీ దురేన్ తెలిపారు. అయితే రెండోసారి కరోనా సోకితే తీవ్రత తక్కువగా ఉండొచ్చని వ్యాధి నిరోధకత నిపుణులు చెబుతున్నారు.

More News

ఆయన తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.. ఆ స్థానంలోకి ఎవరొస్తారు?

ఏపీలో చెప్పుకోదగిన ఉద్యమాల్లో ఒకటి కాపు ఉద్యమం. తుని ఘటన రాష్ట్ర చరిత్రలోనే మరిచిపోలేనిది.

తెలంగాణలో నిన్న మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు

తెలంగాణలో సోమవారం మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. అంతకు ముందు మూడు రోజులు కరోనా పాజిటివ్ కేసులు 1200 లోపు మాత్రమే నమోదయ్యాయి.

విశాఖ సాల్వెంట్స్ సంస్థలో భారీ అగ్ని ప్రమాదం.. భారీ పేలుళ్లు..

విశాఖ ప్రమాదాలకు పుట్టినిల్లుగా మారుతోందేమో అనిపిస్తోంది.. ఈ మధ్య జరుగుతున్న వరుస ఘటనలను చూస్తే..

ప‌వ‌న్ భ‌క్తుడి పాత్ర‌లో ఆర్జీవీ?

ప‌వ‌ర్‌స్టార్‌,జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు భారీ అభిమాన గ‌ణం సొంతం. జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా ఆయ‌నకు అభిమానులుంటడ‌మే ఆయ‌న క్రేజ్‌కు నిద‌ర్శ‌నం.

25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గుణశేఖర్ ఉత్తమ చిత్రం 'సొగసు చూడతరమా'

'రుద్రమదేవి'తో దర్శకనిర్మాతగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుని ప్రస్తుతం ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం 'హిరణ్యకశ్యప' ప్రారంభిస్తున్న డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్