close
Choose your channels

‘సైరా’ టీజర్‌ రిలీజ్‌కు కౌంట్ డౌన్

Tuesday, August 20, 2019 • తెలుగు Comments

‘సైరా’ టీజర్‌ రిలీజ్‌కు కౌంట్ డౌన్

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సైరా న‌రసింహారెడ్డి’. ఈ చిత్రంలో పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన దాదాపు అన్ని అప్డేట్స్‌ను మెగాభిమానులకు అందజేసింది చిత్రబృందం. అతి త్వరలోనే ‘సైరా’ ఫ్యాన్స్ ముందుకు వచ్చే్స్తున్నాడు. సినిమా రిలీజ్‌కు రోజులు దగ్గరపడుతుండటంతో దర్శకనిర్మాతలు ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే మేకింగ్ వీడియో, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వాయిస్‌ను రిలీజ్ చేసి అదుర్స్ అనిపించిన చిత్రబృందం ఇవాళ టీజర్‌ను రిలీజ్ చేయబోతోంది.

అయితే టీజర్‌లో ఏమేం ఉంటుంది..? ఎలా ఉంటుంది..? టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని మెగాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సరిగ్గా టీజర్ మంగళవారం మధ్యాహ్నం 2:40 గంటలకు విడుదల కానుంది. సో.. ఇప్పట్నుంచే కౌంట్ డౌన్ షురూ అయ్యింది. 2:40 ఎప్పుడెప్పుడు అవుతుందా అని మెగాభిమానులు గడియారాల వైపు తథేకంగా చూస్తూ కూర్చుండిపోయారు.

కాగా.. కొణిదెల ప్రొడ‌క్షన్స్ బ్యానర్‌లో హీరో రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో న‌య‌న‌తార.. చిరు సరసన నటిస్తుండగా.. అమితాబ్ బ‌చ్చన్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు వంటి టాప్ స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తుండటం సినిమాకు మరింత ఎట్రాక్షన్ తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి సందర్భంగా సినిమా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Get Breaking News Alerts From IndiaGlitz