close
Choose your channels

జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌... ద‌ర్శ‌కుల‌కు కోర్టు నోటీసులు

Tuesday, November 5, 2019 • తెలుగు Comments

జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌... ద‌ర్శ‌కుల‌కు కోర్టు నోటీసులు

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణాంత‌రం .. ఆమెపై రెండు, మూడు బ‌యోపిక్స్‌ను ద‌ర్శక నిర్మాతు అనౌన్స్ చేశారు. వీటిలో రెండు భారీ చిత్రాలున్నాయి. అందులో ఒక‌టి ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో విష్ణు ఇందూరి నిర్మిస్తున్న`త‌లైవి`. ఇందులో బాలీవుడ్ తార కంగ‌నా రనౌత్ జ‌య‌లలిత‌గా న‌టిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమా సెట్స్ పై కి వెళ్ల‌నుంది. కాగా చిత్రం ప్రియ‌ద‌ర్శిని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. 

`ది ఐర‌న్ లేడీ` పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో నిత్యామీన‌న్ జ‌య‌ల‌లితగా న‌టిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. అంతా బాగానే ఉంది అనుకున్నారు. కానీ అస‌లు పేచీ ఇప్పుడే మొద‌లైంది. జ‌య‌ల‌లిత మేన‌కోడ‌లు దీప.. జ‌య‌ల‌లిత బ‌యోపిక్స్‌పై త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌డ‌మే కాక‌.. ఈ బ‌యోపిక్స్ కార‌ణంగా త‌మ వ్య‌క్తిగ‌త జీవితాల‌కు భంగం వాటిల్లుతుంద‌ని పేర్కొన్నారు. త‌మ కుటుంబ స‌భ్యుల‌ అనుమ‌తి లేకుండా జ‌య‌ల‌లిత బ‌యోపిక్స్ ఎలా చేస్తారు? అంటూ కోర్టులో కేసు వేశారు. దీనిపై ఇద్ద‌రి దర్శ‌కుల‌తో పాటు జ‌య‌లలిత బ‌యోపిక్‌ను వెబ్‌సిరీస్‌గా తెర‌కెక్కించిన గౌత‌మ్ మీన‌న్‌కు మ‌ద్రాసు హైకోర్టు నోటీసుల‌ను జారీ చేసింది. మ‌రిప్పుడు చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు ఈ వ్య‌వ‌హారంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

Get Breaking News Alerts From IndiaGlitz