న‌య‌న‌తార చిత్రం విడుద‌ల‌ను ఆప‌మ‌న్న కోర్టు

  • IndiaGlitz, [Tuesday,June 11 2019]

న‌య‌న‌తార సినిమా అన‌గానే హీరో ఎవ‌రు అని అడిగే కాలం ఎప్పుడో కొండెక్కింది. ఇప్పుడు ఆమే సూప‌ర్‌స్టార్‌. అయితే ఈ లేడీ సూప‌ర్‌స్టార్ న‌టించిన 'కొలైయుదిర్ కాలం' చిత్రం విడుద‌ల‌ను ఆప‌మ‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌లో చ‌క్రి తోలేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం 'కొలైయుదిర్ కాలం'. ఈ సినిమాకు సంబంధించిన వేడుక‌లోనే న‌య‌న‌తార‌ను న‌టుడు రాధార‌వి కించ‌ప‌రుస్తూ వ్యాఖ్య‌లు చేసింది. అయితే ఈ సినిమాను ఈ నెల 14న విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కాగా, మ‌ద్రాసు హైకోర్టులో ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి ఓ పిటిష‌న్ న‌మోదైంది. ద‌ర్శ‌కుడు బాలాజీ కుమార్ ఈ పిటిష‌న్‌ను వేశారు.

దివంగ‌త ర‌చ‌యిత సుజాతా రాసిన న‌వల 'కొలైయుదిర్ కాలం' హ‌క్కుల‌ను తాను కొనుగోలు చేశాన‌ని, ఇప్పుడు అదే పేరుతో సినిమా రావ‌డం త‌న‌కు అభ్యంత‌ర‌మ‌ని ఆ పిటిష‌న్లో ద‌ర్శ‌కుడు బాలాజీ కుమార్ పేర్కొన్నారు. ఆయ‌న పిటిష‌న్‌ను విచారించిన మ‌ద్రాసు హై కోర్టు సినిమా విడుద‌ల‌ను బ్యాన్ చేస్తూ ఇంటెరిమ్‌ను పాస్ చేసింది. చిత్ర నిర్మాత మ‌దియ‌ళ‌గ‌న్ ఈ విష‌య‌మై త‌మ‌కు ఈ నెల 21 లోపు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని తెలిపింది.

సో ఈ వారం న‌య‌న్ సినిమా వ‌స్తుందో, లేదో వేచి చూడాల్సిందే.

More News

వాల్మీకి కోసం తెలుగమ్మాయి

`వాల్మీకి` సినిమా గురించి ఈ మ‌ధ్య త‌ర‌చూ అప్‌డేట్‌లు వినిపిస్తున్నాయి. సెప్టెంబ‌ర్ 6న సినిమాను విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు ఇటీవ‌ల చిత్ర యూనిట్ వెల్ల‌డించింది.

నాగార్జున 'మ‌న్మ‌థుడు 2' టీజ‌ర్‌ విడుదల తేదీ

కింగ్ నాగార్జున హీరోగా మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ ప‌తాకాల‌పై రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`.

చంద్రబాబుకు ఎందుకంత భయం.. ఇంకా తేరుకోలేదు!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పట్లో తేరుకునే పరిస్థితి లేనట్లేనని తెలుస్తోంది.

వైఎస్ జగన్‌ను కలిసిన నిఖిల్.. రాజకీయాల్లో చర్చ!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మాజీ ప్ర‌ధాని దేవెగౌడ మ‌న‌వ‌డు, క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి కుమారుడు నిఖిల్ గౌడ క‌లిశారు.

ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రివెంజ్ ఉంటుందా!?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.