close
Choose your channels

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్లు సంచలన తీర్పు..

Wednesday, September 30, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో దాదాపు 28 ఏళ్ల తరువాత కోర్టు తీర్పును వెలువరించింది. ఉత్తరప్రదేశ్‌‌ లక్నోలోని సీబీఐ స్పెషల్ కోర్టు నేడు సంచలన తీర్పును వెలువరించింది. కూల్చివేత పథకం ప్రకారం జరగలేదని కోర్టు పేర్కొంది. పథకం ప్రకారమే జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని తేల్చి చెప్పింది. నిందితులపై స్పష్టమైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. మొత్తం 32 మందిపై మోపిన అభియోగాలకు సరైన ఆధారాలు లేవని తేల్చింది.

నిందితులపై మోపిన అభియోగాలను సీబీఐ నిరూపించలేకపోయిందని కోర్టు స్పష్టం చేసింది. నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనడంలో ఎలాంటి ఆధారాలూ లేవని కోర్టు వెల్లడించింది. సీబీఐ సమర్పించిన వీడియో, ఆడియో ఆధారాలు ప్రామాణికంగా లేవని పేర్కొంది. ఈ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా సీబీఐ స్పెషల్ కోర్టు ప్రకటించింది. 28 ఏళ్ల పాటు జరిగిన విచారణలో 351 మంది సాక్ష్యులను కోర్టు విచారించింది.

అయోధ్యలో 6 డిసెంబర్ 1992న బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన చోటు చేసుకుంది. దీనిపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. 2001 మేలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అద్వానితో పాటు ఇతర నిందితులపై నేరపూరిత కుట్ర అభియోగాలను తొలగిస్తూ సీబీఐ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పును 2010లో అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లగా.. కుట్ర అభియోగాలను కొనసాగించాలని 2017 ఏప్రిల్ 19న ఆదేశించింది. రోజువారీ విచారణ కొనసాగించాలని.. రెండేళ్లలో తీర్పును వెలువరించాలని లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆదేశించింది. అప్పటి నుంచి విచారణ కొనసాగుతుండగా.. నేడు తీర్పు వెలువడింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.