హీరోకు కోర్టు హెచ్చ‌రిక‌...

  • IndiaGlitz, [Sunday,September 02 2018]

త‌మిళ హీరో శింబుపై మ‌ద్రాస్ హైకోర్టు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. శింబు గ‌తంలో ఫ్యాష‌న్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో 'అర‌స‌న్‌' అనే మూవీ చేయ‌డానికి 50 ల‌క్ష‌ల రూపాయ‌లు అడ్వాన్స్ తీసుకున్నారు. కానీ సినిమా చేయ‌లేక‌పోయారు. అయితే అడ్వాన్స్ తిరిగి ఇవ్వ‌లేదు.. అలాగే.. సినిమాను చేయ‌లేదంటూ సద‌రు నిర్మాణ సంస్థ ఫ్యాష‌న్ మూవీ మేక‌ర్స్ కోర్టు కెళ్లారు.

కేసును ప‌రిశీలించిన కోర్టు మొత్తం, వ‌డ్డీ క‌లిపి మొత్తంగా 85.50 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను చెల్లించాల‌ని శింబ‌ను ఆదేశించింది. ఒక‌వేళ చెల్లించ‌క‌పోతే.. సెల్ ఫోన్ స‌హా అత‌ని ఆస్థులు జ‌ప్తు చేస్తామ‌ని హెచ్చరించింది. నాలుగు వారాల్లో పూచీక‌త్తు ఇవ్వాల‌ని ఆదేశించింది.

అయితే తాను సినిమా కోసం ఇచ్చిన డేట్స్‌లో నిర్మాణ సంస్థ సినిమా చేసుకోలేదని.. అందులో త‌న త‌ప్పేం లేదంటూ శింబు త‌ర‌పు న్యాయ‌వాది కోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు. మ‌రి దీని పై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

More News

సైరా లో అవుకురాజు గా సుదీప్

మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో..సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేందర్‌ రెడ్డి దర్శకుడిగా హై టెక్నికల్‌ వేల్యూస్‌తో.. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా

ముఖ్య‌మంత్రి పాత్ర‌లో విజ‌య్‌

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టిస్తున్న కొత్త చిత్రానికి 'స‌ర్కార్' అనే టైటిల్‌ను నిర్ణ‌యించారు. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడు. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

కూర‌గాయ‌లు అమ్మిన సామ్‌...

స‌మంత సినిమాలో సన్నివేశంలో కాకుండా.. నిజంగానే కూర‌గాయ‌లు అమ్మింది. అదేంటి స‌మంత కూర‌గాయ‌లు అమ్మిందా? అక్కినేని వారింటి కోడ‌లు కూర‌గాయ‌లు అమ్మ‌డ‌మేంటి?

సుదీప్ పాత్ర పేరెంటంటే..?

మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో..సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేందర్‌ రెడ్డి దర్శకుడిగా హై టెక్నికల్‌ వేల్యూస్‌తో.. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా

సీమ నేప‌థ్యంలో....

ద‌ర్శ‌క నిర్మాత‌గా ఆఫీస‌ర్ చాలా ఘోర‌మైన ప్లాప్ అయ్యింది. త‌ర్వాత రామ్‌గోపాల్ వ‌ర్మ సోష‌ల్ మీడియాలో కూడా సైలెంట్ అయిపోయాడు.