Download App

హీరోకు కోర్టు హెచ్చ‌రిక‌...

త‌మిళ హీరో శింబుపై  మ‌ద్రాస్ హైకోర్టు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. శింబు గ‌తంలో ఫ్యాష‌న్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో 'అర‌స‌న్‌' అనే మూవీ చేయ‌డానికి 50 ల‌క్ష‌ల రూపాయ‌లు అడ్వాన్స్ తీసుకున్నారు. కానీ సినిమా చేయ‌లేక‌పోయారు. అయితే అడ్వాన్స్ తిరిగి ఇవ్వ‌లేదు.. అలాగే.. సినిమాను చేయ‌లేదంటూ సద‌రు నిర్మాణ సంస్థ ఫ్యాష‌న్ మూవీ మేక‌ర్స్ కోర్టు కెళ్లారు.

కేసును ప‌రిశీలించిన కోర్టు మొత్తం, వ‌డ్డీ క‌లిపి మొత్తంగా 85.50 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను చెల్లించాల‌ని శింబ‌ను ఆదేశించింది. ఒక‌వేళ చెల్లించ‌క‌పోతే.. సెల్ ఫోన్ స‌హా అత‌ని ఆస్థులు జ‌ప్తు చేస్తామ‌ని హెచ్చరించింది. నాలుగు వారాల్లో పూచీక‌త్తు ఇవ్వాల‌ని ఆదేశించింది.

అయితే తాను సినిమా కోసం ఇచ్చిన డేట్స్‌లో నిర్మాణ సంస్థ సినిమా చేసుకోలేదని.. అందులో త‌న త‌ప్పేం లేదంటూ శింబు త‌ర‌పు న్యాయ‌వాది కోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు. మ‌రి దీని పై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.