అన్‌లాక్ -3 మార్గదర్శకాలివే..

  • IndiaGlitz, [Thursday,July 30 2020]

అన్‌లాక్-3కి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ తాజాగా విడుదల చేసింది. థియేటర్స్ తెరిచేందుకు పర్మిషన్ ఇస్తారేమోనని భావించిన ఇండస్ట్రీకి నిరాశే మిగిలింది. కరోనా దారుణంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆగస్టు 31 వరకూ దేశవ్యాప్తంగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం అన్‌లాక్-3 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం కొన్ని సడలింపులను ప్రకటించింది. ఆగస్ట్ 5 నుంచి యోగా ఇన్‌స్టిట్యూట్స్‌, జిమ్‌లు తెరిచేందుకు అనుమతించింది. అయితే కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఇప్పటి వరకూ నడుస్తున్న రాత్రి వేళల్లో కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేసింది. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కూడా కేంద్రం అనుమతినిచ్చింది.

అయితే హెల్త్ ప్రోటోకాల్స్, భౌతికర దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఆగస్ట్ 31 వరకూ స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు తెరవకూడదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసులను వందే భారత్ మిషన్‌లో భాగంగా పరిమిత సంఖ్యలో అనుమతినిస్తున్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లు నడిపేందుకు అనుమతిని నిరాకరించింది. అలాగే సినిమా హాల్స్‌ తెరిచేందుకు అనుమతి లేదని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు, స్విమ్మింగ్ పూల్స్‌కు, పార్కులకు, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్, సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, మతపరమైన సభలన్నింటికీ అనుమతి లేదని స్పష్టం చేసింది. కాగా అనుమతి నిరాకరించిన వాటన్నింటికీ పరిస్థితులు అనుకూలిస్తే మాత్రం దశలవారీగా అనుమతినిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

More News

దిగ్గజ దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్

దిగ్గజ దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సైతం కోవిడ్ బారిన పడ్డారు.

ఆర్జీవీకి కొత్త స‌మ‌స్య‌!!

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ వ‌రుస సినిమాల‌ను విడుద‌ల చేస్తూ అంద‌రికీ షాకిస్తుంటే..

మెగాస్టార్‌ కాంప్లిమెంట్‌తో ఆస్కార్‌ వచ్చినంత సంబరపడ్డా! – శ్రీధర్‌ సీపాన బర్త్‌డే ఇంటర్వ్యూ

‘లౌక్యం’ తెలిసిన రచయిత శ్రీధర్‌ సీపాన. ఏకకాలంలో ఐదారు చిత్రాలకు పని చేయగల సమర్ధుడు.

కొత్త ట్విస్ట్ ఇచ్చిన నటి శ్రీ సుధ

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు సోదరుడు శ్యామ్‌ కె నాయుడి తనను పెళ్లి పేరుతో మోసం చేశారంటూ నటి శ్రీ సుధ గతంలో

ఏపీలో షాకిచ్చిన కరోనా.. నేడొక్కరోజే 10 వేలకు పైగా కేసులు..

ఏపీలో కరోనా షాకిస్తోంది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాకూడా కరోనా విజృంభణ మాత్రం ఆగట్లేదు.