CPI Narayana : వాళ్లకి శోభనం గదినిచ్చారు.. మరి మిగిలిన వాళ్ల పరిస్థితేంటీ ‘‘ నాగన్నా’’ : నాగ్‌కు నారాయణ కౌంటర్

  • IndiaGlitz, [Monday,September 12 2022]

బిగ్‌బాస్‌ రియాలిటీ షోపై సీపీఐ జాతీయ నేత నారాయణ చేసిన కామెంట్స్ తెలుగు సినీ, రాజకీయ రంగాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ హౌస్ ఒక బ్రోతల్ హౌస్ అని, హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జునకు డబ్బే ముఖ్యమని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు నాగ్‌కు కూడా చిరాకు తెప్పించినట్లుగా వున్నాయి. అందుకే ఇన్నాళ్ల కెరీర్‌లో వివాదాలకు దూరంగా వుంటూ వస్తున్న నాగార్జున కూడా నారాయణకు కౌంటరిచ్చారు. గత శనివారం బిగ్‌బాస్ షోలో మెరీనా, రోహిత్‌లను అందరి ముందు హగ్ ఇచ్చుకోమని సలహా ఇస్తూ... నారాయణ నారాయణ వాళ్లు పెళ్లయిన వాళ్లు అంటూ పరోక్షంగా నారాయణకు కౌంటరిచ్చారు.

వాళ్లకి పెళ్లయ్యింది సరే.. మిగిలిన వాళ్లేం చేస్తారు:

తాజాగా దీనిపై సీపీఐ నారాయణ స్పందించారు. ఈసారి ఏకంగా ఓ వీడియో రిలీజ్ చేసి నాగార్జునను మరోసారి టార్గెట్ చేశారు పెద్దాయన. నాగన్నా, నాగన్నా.. బిగ్‌బాస్ షోలో మీరు పెళ్లైన వాళ్లకి మాత్రమే లైసెన్స్ ఇచ్చారు, శోభనం గదిని ఏర్పాటు చేశారు, మిగతా వాళ్లు ఏమయ్యారన్నా అంటూ నారాయణ సెటైర్లు వేశారు. వాళ్లకి పెళ్లిళ్లు కాలేదని, పైగా బంధువులు కూడా కాదని... వంద రోజుల పాటు వాళ్లేం చేస్తారు అది కూడా చెప్పన్నా అంటూ నారాయణ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనిని నాగార్జున పట్టించుకుంటారా.. లేదంటే వివాదం మరింత పెద్దది కాకుండా సైలెంట్‌గా వుంటారా అన్నది వేచి చూడాలి.

ఎలిమినేషన్ లేకుండానే ముగిసిన బిగ్‌బాస్ ఫస్ట్ వీక్:

ఇకపోతే .. బిగ్‌బాస్ 6 తొలి వారం విజయవంతంగా పూర్తి చేసుకుంది. అప్పుడే కొందరు కంటెస్టెంట్స్ జనానికి నోటెడ్ అయ్యారు. గలాటా గీతూ, రేవంత్, రోహిత్ , మెరీనా, ఫైమా, బాలాదిత్యల గురించి ఆడియన్స్ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సాధారణంగా ఆదివారం వచ్చిందంటే ఎవరు ఎలిమినేషన్ అవుతారోనన్న ఉత్కంఠ సహజం. కానీ ఆరో సీజన్ ఫస్ట్ వీక్ ఎలాంటి ఎలిమినేషన్ లేకుండా తుస్సుమంది. ఈ వారం ఎలిమినేషన్ లేకపోవడంపైనా నాగ్ క్లారిటీ ఇచ్చారు. అందరికీ ఇది తొలి వారమేనని, ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి టైం పడుతుందని అందుకే ఎవరిని ఎలిమినేషన్ చేయడం లేదని నాగార్జున స్పష్టం చేశారు.

More News

Nenu Meeku Baaga Kavalsinavaadini: 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' చిత్రం నుండి "చాలాబాగుందే" లిరికల్ సాంగ్ విడుదల

యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

‘‘తేనే మనసులు ’’లో కృష్ణ సెలెక్ట్.. కృష్ణంరాజు రిజెక్ట్: పార్టీ ఇచ్చిన రెబల్ స్టార్, ఆవేశంగా సూపర్‌స్టార్‌

రెబల్ స్టార్ కృష్ణంరాజుకు టాలీవుడ్‌లో వున్న అతికొద్దిమంది సన్నిహితుల్లో సూపర్‌స్టార్ కృష్ణ కూడా ఒకరు.

Krishnam Raju  : తెలుగులో పైరసీకి బలైన తొలి హీరో కృష్ణంరాజే.. ఏ సినిమా, ఆ కథేంటీ..?

సినీ రంగాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో పైరసీ ఒకటి. కాలంతో పాటు ఇప్పుడిది తన వేషం మార్చుకుంది.

Krishnam Raju: రేపు మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు.. ముమ్మరంగా ఏర్పాట్లు

అనారోగ్యంతో మరణించిన దిగ్గజ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలోని

Pooja Hegde : పింక్ కలర్ డ్రెస్‌లో నవ్వులు, కొంటె ఫోజులు... ‘‘సైమా’’ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా బుట్ట బొమ్మ

దక్షిణాదిలో ప్రత్యేకించి తెలుగులో కమర్షియల్ సినిమాలకు, స్టార్ హీరోల మూవీస్‌కి హీరోయిన్ కావాల్సి వస్తే అందరి చూపు పూజా హెగ్డే వైపే.