మ‌రోసారి క్రేజీ క‌ల‌యిక‌.. అయితే!!

ఈ ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లైన ‘అల వైకుంఠ‌పుర‌ములో’ చిత్రంతో త‌న కెరీర్‌లోనే భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్‌. బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ‘జులాయి’, ’స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి’ చిత్రాల త‌ర్వాత తెర‌కెక్కిన మూడో చిత్ర‌మిది. ఇప్పుడు వీరిద్ద‌రూ మ‌రోసారి క‌లిసి ప‌నిచేయ‌బోతున్నారు. అయితే సినిమా కాదు.. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో. వివ‌రాల్లోకెళ్తే..ఇటీవ‌ల తెలుగులో ప్రారంభ‌మైన ఓటీటీ ఫ్లాట్‌ఫ్లామ్ ‘ఆహా’ కోసం ఓ యాడ్‌ను త‌యారు చేస్తున్నారు. అందులో బ‌న్నీ న‌టిస్తుండ‌గా, త్రివిక్ర‌మ్ స‌ద‌రు యాడ్‌ను డైరెక్ట్ చేయ‌బోతున్నార‌ట‌. ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ సినిమా చేస్తుండ‌గా, ఎన్టీఆర్‌తో త్రివిక్ర‌మ్ ఈ ఏడాదిలో సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు.

బ‌న్నీ, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో రూపొందిన ‘అల వైకుంఠ‌పుర‌ములో’ సంక్రాంతికి విడుద‌లై రూ.200 కోట్ల‌కు పైగా వసూళ్ల‌ను సాధించి భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. బ‌న్నీ ఇప్పుడు సుకుమార్‌తో సినిమాను చేయ‌డానికి రెడీ అయిపోయాడు. ఈ నెల ద్వితీయార్థం నుండి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కేర‌ళ అడ‌వుల్లో ప్రారంభం కానుంది. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోయే రివేంజ్ డ్రామాగా సుక్కు ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది.

More News

అందుకే మా నాన్న ఆత్మహత్య ...: అమృత

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.

సునీల్ ఆవిష్కరించిన '302' ట్రైలర్

భవికా దేశాయ్ ప్రధాన పాత్రలోను, వెన్నెల కిశోర్, రవివర్మ, విజయసాయి, తాగుబోతు రమేష్ కీలక పాత్రలలోను నటించిన చిత్రం 302.

కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక‌జ‌వాల్క‌ర్ జంట‌గా రాయలసీమ నేపథ్యంలో ' SR కళ్యాణమండపం - Est. 1975 '

'రాజావారు రాణిగారు' చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన కిరణ్ అబ్బవరం హీరోగా, టాక్సివాలా చిత్రంతో ఆకట్టుకున్న ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్

నితిన్ పెళ్లికి క‌రోనా ఎఫెక్ట్‌

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌గా ఇన్నాళ్లు ఉన్న నితిన్ త‌ర్వ‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగ‌తి తెలిసిందే.

అల్ల‌రోడి జ‌త‌గా చంద‌మామ‌

అల్ల‌రి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి నేటిత‌రం హీరోల్లో కామెడీ స్టార్‌గా పేరు సంపాదించుకుని యాబై సినిమాల‌ను పూర్తి చేశాడు అల్ల‌రి న‌రేశ్‌.