క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న ‘విరాట‌ప‌ర్వం’ డిజిట‌ల్ హ‌క్కులు

  • IndiaGlitz, [Wednesday,March 03 2021]

నక్సలైట్.. రాజకీయ నాయకుడు రవన్న పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తోన్న చిత్రం ‘విరాట‌ప‌ర్వం’. రానా జోడీగా సాయిప‌ల్ల‌వి న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల తెర‌కెక్కిస్తున్నాడు. సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఏప్రిల్ 30న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమాను తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేశారు. అందుకు త‌గిన‌ట్లు సినిమాను ఇత‌ర భాషా నటీన‌టుల‌తో రూపొందిస్తున్నారు. రానా పాత్ర‌కు సంబంధించిన చిన్న వీడియో ప్రోమో, కోలు కోలు అనే సాంగ్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. ఈ నేప‌థ్యంలో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప‌రంగా మంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయ‌ని స‌మాచాచారం.

తాజా స‌మాచారం మేర‌కు ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ హ‌క్కుల‌ను రు.11 కోట్ల‌కు ద‌క్కించుకుంద‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. రానా సినిమాల్లో ఈ సినిమాకే ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువ మొత్తంలో డిజిట‌ల్ హ‌క్కులు వ‌చ్చిన‌ట్లు అని అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై డి.సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

More News

ప‌వ‌న్ 27...మ‌రో డైరెక్ట‌ర్ కూడా జాయిన‌య్యాడు..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్, క్రిష్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’(వినిపిస్తోన్న టైటిల్).

పార్వతీశం, శ్రీలక్ష్మి జంటగా ఏ1 మహేంద్ర క్రియేషన్స్ సినిమా 'సావిత్రి w/o సత్యమూర్తి' ప్రారంభం

'కేరింత' ఫేమ్ పార్వతీశం కథానాయకుడిగా ఏ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మిస్తున్న సినిమా 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి'.

కరోనా ఎఫెక్ట్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న రామోజీ

కరోనా మహమ్మారి ఎఫెక్ట్ ప్రపంచంపై అంతా ఇంతా కాదు. చాలా వరకూ సంస్థలన్నీ కుదేలైపోయాయి.

‌'గుండె క‌థ వింటారా' చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న మ‌ధునంద‌న్‌

ఇష్క్‌, గుండెజారి గ‌ల్లంత‌య్యిందే, గీతాంజ‌లి, ఒక లైలా కోసం, టాక్సీవాలా త‌దిత‌ర స‌క్సెస్‌ఫుల్ ఫిలిమ్స్‌లో న‌టించిన పాపుల‌ర్ క‌మెడియ‌న్ మ‌ధునంద‌న్ 'గుండె క‌థ వింటారా'

రాజశేఖర్ హీరోయిన్‌గా ‘జార్జిరెడ్డి’ బ్యూటీ

‘జార్జిరెడ్డి’ సినిమాతో హీరోయిన్‌గా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ ముస్కాన్ ఖుబ్చందాని.