close
Choose your channels

విమర్శకుల ప్రశంసలందుకుంటున్న ‘ఉప్పెన’

Monday, February 15, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విమర్శకుల ప్రశంసలందుకుంటున్న ‘ఉప్పెన’

ఏమాత్రం అంచనాలు లేవు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అని తప్ప.. ఈ సినిమా హీరోయిన్ నుంచి డైరక్టర్ వరకూ అన్ని కొత్త మొహాలే. తొలిరోజు రివ్యూలు సైతం ఫేవర్‌గా వచ్చింది లేదు. ఒక్క మౌత్ టాక్ మాత్రం ఈ సినిమాకు ఫేవర్‌గా వచ్చింది. అంతే ఈ సినిమా దూసుకెళ్లింది. డెబ్యూట్ హీరోకి ఊహించని విజయాన్ని తెచ్చిపెట్టింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగుతోంది. ఈ సినిమా మరేదో కాదు.. ‘ఉప్పెన’. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్, క్రితి శెట్టి జంటగా ఈ సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌ పతాకంపై.. న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, సుకుమార్‌ నిర్మించారు.

డైరెక్టర్ కూడా కొత్త వ్యక్తే కావడం విశేషం. సుక్కు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ చిత్రాన్ని మరో మెట్టు ఎక్కించింది. ప్రస్తుతం ఈ సినిమా విమర్శకుల ప్రసంశలు సైతం అందుకుంటోంది. తాజాగా జలపతి గూడెల్లి అనే ఫిల్మ్ క్రిటిక్.. ‘ఉప్పెన’ సినిమాపై తన అభిప్రాయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ‘‘ఉప్పెన’ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌ను నమోదు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి మొదటి వీకెండ్‌లో రూ.26 కోట్ల షేర్‌తో ఈ సినిమా దూసుకెళ్లింది’’ అని జలపతి గూడెల్లి పేర్కొన్నారు. లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి థియేటర్ల పరిస్థితి దారుణంగా తయారైంది.

ఇటీవలే థియేటర్లను ఓపెన్ చేసినప్పటికీ 50 శాతం ఆక్యుపెన్సీ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నాయి. 100 శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన అనంతరం ‘ఉప్పెన’ విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ థియేటర్లకు మరింత ఊపునిచ్చింది. థియేట్రికల్ బిజినెస్ సాధారణ స్థితికి వచ్చిన విషయాన్ని ఈ చిత్రం ప్రూవ్ చేసింది. ఇదే విషయాన్ని జలపతి గూడెల్లి తన పోస్టులో పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా వెండితెరకు కొత్తగా పరిచయమైన హీరోహీరోయిన్ల కేరీర్‌కే కాకుండా డైరెక్టర్ కెరీర్‌కు కూడా అద్భుతమైన ఓపెనింగ్‌ను ఇచ్చింది. అంతేకాకుండా ఈ సినిమా తెలుగు స్టేట్స్‌లో థియేట్రికల్ బిజినెస్ సాధారణ స్థితికి వచ్చేసిన విషయాన్ని కూడా ప్రూవ్ చేసింది’’ అని జలపతి పేర్కొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.