గంటల వ్యవథిలో పంట నష్టం పరిహారం: ముఖ్యమంత్రి చంద్రబాబు


Send us your feedback to audioarticles@vaarta.com


ఒకప్పుడు రైతులు పంట నష్టపోతే, ఓ కమిటీ వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించేంది. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేది. ఆ రిపోర్ట్ ఆధారంగా పంట నష్టానికి పరిహారం అందించేది ప్రభుత్వం. ఇదంతా జరిగేసరికి ఓ ఏడాది పట్టేది. పంట నష్టం డబ్బుల కోసం రైతులు మరింత డబ్బు నష్టపోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. గంటల వ్యవథిలో పంట నష్టం పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటోంది.
అకాల వర్షాల కారణంగా పంటల నష్టాన్ని వెంటనే అంచనా వేసి, నష్టపోయిన రైతులకు మంగళవారం సాయంత్రంలోగా పెట్టుబడి సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, పంటనష్టంపై సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షాలతో 2,224 హెక్టార్లలో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని, 138 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మామిడి తదితర ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు సీఎంకు నివేదిక ఇచ్చారు.
పశ్చిమగోదావరి జిల్లాలో 1,033 హెక్టార్లు, నంద్యాలలో 641, కాకినాడలో 530, శ్రీసత్యసాయి జిల్లాలో 20 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. కృష్ణా, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, తిరుపతి, నంద్యాల, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. ఈ నష్టాలన్నింటినీ గంటల వ్యవథిలో పరిహారం అందించాలని సీఎం సూచించారు.
మరోవైపు పిడుగు పాటు కారణంగా చనిపోయిన 10 మంది కుటుంబాలకు తక్షణమే పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. పిడుగుపాటుకు చనిపోయిన పశువులకు నిబంధనలకు అనుగుణంగా సాయం విడుదల చేయాలని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com