ఆస్కార్ అవార్డుల దేశీయ కమెటీ ఛైర్మెన్ గా ఎన్నికైన సివిరెడ్డి

  • IndiaGlitz, [Tuesday,September 05 2017]

ప్ర‌పంచ సినిమాలో మేటి అయిన ఆస్కార్ అవార్డు క‌మెటీకి భార‌త దేశ‌పు సినిమాను ఎంపిక చేసే క‌మెటీకి ఛైర్మెన్ గా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు నిర్మాత సివిరెడ్డి ఎంపిక అయ్యారు.. భార‌త దేశంలోని వివిధ భాష‌ల నుండి ప‌ద‌నాలుగు మంది స‌భ్యులుంటారు.. ఈ క‌మెటీకి మొట్ట మొద‌టి సారిగా ఎన్నికైన తొలి తెలుగు వాడు సివిరెడ్డి కావ‌డం విశేషం..ఆస్కార్ అవార్డులు స్థాపించి 90 సంవ‌త్స‌రాలు అయింది. ఆస్కార్ అవార్డు స్థాపించ‌నప్పుడు కేవ‌లం ఆంగ్ల సినిమాల‌కుమాత్ర‌మే ఈ అవార్డులు ఇచ్చేవారు.

అయితే 1957 లో మొద‌టి సారిగా ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాలను ఇందులో చేర్చారు.. అలా మొట్ట మొద‌టి సారి విదేశీ సినిమాకు అవార్డుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన తొలి సంవ‌త్స‌ర‌మే అంటే 1957 లో మ‌న దేశానికి చెందిన మ‌ద‌ర్ ఇండియా సినిమా ఆస్కార్ కు నామినేట్ అయింది. దాని త‌రువాత 1988 లో మ‌ద‌ర్ ఇండియా 2001 లో ల‌గాన్ సినిమా లు నామినేట్ అయ్యాయి..1957 నుండి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న దేశీయ సినిమా విభాగానికి ఆస్కార్ క‌మెటీకి ఇప్ప‌టి వ‌ర‌కు అంటే దాదాపు 60 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఒక్క తెలుగు వాడు కూడా ఈ ఛైర్మెన్ గా ఎంపిక కాలేదు .. ఆస్కార్ క‌మెటీ ఛైర్మెన్ గా ఎన్నికైన తొలి తెలుగు వారిగా సి.వి.రెడ్డి గారు చ‌రిత్ర సృష్టించారు.

సి.వి.రెడ్డి గారు త‌న తొలి చిత్రం బ‌దిలీ తో నందీ అవార్డును అందుకున్నారు. ఆయ‌న దాదాపు 12 సినిమాల‌ను నిర్మించారు. 1999 లో వీరు తీసిన అమ్మ నాన్న కావాలి అనే సినిమా కు ఉత్త‌మ సందేశాత్మ‌క చిత్రంగా రాష్ట్ర ప్ర‌భుత్వ అవార్డును అందుకుంది. న‌వ‌లా ర‌చ‌యిత‌గా ఆయ‌న స్వ‌ర్గానికి వీడుకోలు.. వ‌సంత అనే రెండు న‌వ‌ల‌లు రాశారు..అవిబ‌హుళ ప్రాచుర్యాన్ని పొందాయి ఆయ‌న ఫిలింఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ కు జాయింట్ సెక్ర‌ట‌రీగా సెక్ర‌ట‌రీగా వైస్ ప్ర‌సిడెంట్ గా ఉన్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫిలిండెవ‌ల‌ప్ కార్పోరేష‌న్ కు ఆయ‌న వ‌న్ ఆఫ్ ది డైరెక్ట‌ర్ గా 2004 నుండి 2006 వ‌ర‌కు ప‌ని చేశారు. ఇండియ‌న్ పెనోరమా జ్యూరి మెంబ‌ర్ గా రెండు మార్లు జాతీయ ఉత్త‌మ చిత్రాల క‌మెటీ లో జ్యూరీ మెంబ‌ర్ గా 2013 నుండి 2016 వ‌ర‌కు ఉన్నారు. రెండు సార్లు ఫిలింఫేర్ అవార్డుల క‌మెటీ జ్యూరీ మెంబ‌ర్ గా ఆయ‌న కొన‌సాగారు.

2012 లో ఆస్కార్ అవార్డుల దేశీయ క‌మెటీలో ఆయ‌న మెంబ‌ర్ గా ఉన్నారు. ఈ ఆస్కార్ క‌మెటీ ఛైర్మెన్ ను ఫిలింఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా వారు ఎన్నుకుంటారు. ఈ సంద‌ర్భంగా సి.వి.రెడ్డి గారిని క‌లిసిన అవార్డుల చిత్రాల ద‌ర్శ‌క నిర్మాత అల్లాణి శ్రీ‌ధ‌ర్ అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

ప్ర‌పంచ‌ప్ర‌సిద్ది గాంచిన ఆస్కార్ అవార్డుల దేశీయ క‌మెటీకి ఛైర్మెన్ మ‌న తెలుగు వాడు కావ‌డం ఆనంద‌దాయ‌కం అని శ్రీ‌ధ‌ర్ గారు అన్నారు.

More News

మెగాస్టార్ ఆవిష్కరించిన ఇంద్రసేన ఫస్ట్ లుక్

వైవిధ్యమైన సినిమాలతో, వరుస కమర్షియల్ సక్సెస్ లతో    తనకంటూ ఓ మార్క్ ను సృష్టించుకున్న హీరో విజయ్ ఆంథోని తాజాగా నటిస్తొన్న చిత్రం "ఇంద్రసేన".

వెండితెర మీద మరో ఆసక్తికరమైన బయోపిక్!

ప్రస్తుతం బయోపిక్ లు వెండితెరను ఏలుతున్నాయి.ఆ మధ్య 'దంగల్ ' లో

వెంకీ ఇంకోసారి ఒప్పుకున్నాడోచ్!

విక్టరీ వెంకటేశ్ ఎప్పుడూ రొటీన్ ని ఫాలో కావాలని అనుకోరు.

బాల‌య్య‌ను పూరి ఇప్పుడు మిస్ కావ‌ట్లేదు!

నిన్న‌,మొన్న‌టి వ‌ర‌కు 'పైసా వ‌సూల్‌' టీమ్ టీమంతా బాల‌య్య‌ను చూసిన ప్ర‌తి సారీ.. కోకోకోలా పెప్సీ బాల‌య్య‌బాబు సెక్సీ అని, మిస్ యు బాల‌య్యా అని, ల‌వ్ యూ బాల‌య్యా అని, బాల‌య్య‌తో ల‌వ్‌లో ఉన్నామ‌ని ర‌క‌ర‌కాలుగా చెబుతూనే ఉన్నారు.

మ‌రో వార‌సుడి ఎంట్రీ

ఇప్పుడు అంత‌గా చెప్పుకోవ‌డం లేదు కానీ, నాలుగైదు ఏళ్ల క్రితం అంద‌రి నోటా వినిపించిన హీరో పేరు ర‌వితేజ‌. ఏడాదికి రెండు, మూడు సినిమాల‌తో ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించిన ర‌వితేజ ఈ మ‌ధ్య స్పీడు త‌గ్గించి కాస్త నిదానంగా స్క్రిప్ట్ ల‌ను ఎంపిక చేసుకుని న‌టిస్తున్నారు.