శిరీష్‌కు గిఫ్ట్ ఇచ్చిన అర‌వింద్‌

  • IndiaGlitz, [Tuesday,October 11 2016]

అల్లు అర‌వింద్ పెద్ద త‌న‌యుడు అల్లు అర్జున్ టాలీవుడ్ స్టార్ హీరోగా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. బ‌న్ని త‌మ్ముడు అల్లు శిరీష్ కూడా హీరోగా రాణించడానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఇటీవ‌ల గౌర‌వం, కొత్త జంట చిత్రాలు ఆశించిన విజ‌యాన్ని అందించ‌లేదు. అయితే శిరీష్ రీసెంట్‌గా చేసిన శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రంతో మంచి స‌క్సెస్‌ను సాధించాడు.

ఈ సక్సెస్ ప‌ట్ల శిరీష్ కంటే తండ్రి, నిర్మాత అల్లు అర‌వింద్ చాలా హ్యాపీగా ఫీల‌య్యాడ‌ట‌. అందుకే శిరీష్ ఆడి క్యూ 7 కారును బ‌హుమ‌తిగా ఇచ్చాడు. ఈ విష‌యాన్ని శిరీష్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశాడు. శిరీష్‌కు అల్లు అర‌వింద్‌, బ‌న్ని కారును బ‌హుమ‌తిగా ఇచ్చే ఫోటోను కూడా పోస్ట్ చేయ‌డం విశేషం.

More News

వినోదంతో పాటు మంచి సందేశం అందించే విభిన్న‌క‌థా చిత్రం వైశాఖం

చంటిగాడు, గుండ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు, ల‌వ్ లీ...ఇలా విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన లేడీ డైరెక్ట‌ర్ జ‌య‌.బి తాజా చిత్రం వైశాఖం. ఈ చిత్రాన్ని ఆర్.జె.సినిమాస్ బ్యాన‌ర్ పై బి.ఎ.రాజు నిర్మిస్తున్నారు.

న్యూజెర్సీ లో స్వచ్ఛంద కచేరి

కాశ్మీరీ పండిట్ల పై జరిగిన ఉగ్రవాద దాడుల్లో నష్టపోయినవారిని ఆదుకోవడానికి శల్లి కుమార్ అనే వ్యక్తి ఛారిటీ కాన్సెర్ట్ ను ఏర్పాటుచేసారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఈనెల 15న జరుగబోయే ఈవెంట్ లో సినీతారలు పాల్గొని పర్ఫార్మెన్స్ లు చేయనున్నారు.

ముంబాయి కంపెనీతో చేతులు క‌లిపిన రానా..!

బాహుబ‌లి సినిమాతో రానా ఇమేజే మారిపోయింది. ఒక్క‌సారిగా జాతీయ స్ధాయిలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఓ వైపు బాహుబ‌లి 2 సినిమా చేస్తునే మ‌రో వైపు ఘాజీ అనే భారీ చిత్రంలో న‌టిస్తున్నారు.

శ్రీనివాస్ రెడ్డి టైం స్టార్ట్ అయ్యింది

ఇండస్ట్రీ లో త‌న‌కంటూ  ప్రత్యేకమైన స్పేస్ ని సంపాదించుకున్న శ్రీనివాస రెడ్డి గీతాంజలి తర్వాత మరో పాత్రతో అలరించేందుకు రెడీ అయ్యాడు. జయమ్ము నిశ్చయమ్మురా.. లో  మరోసారి తనలోని నటుడ్ని పరిచయం చేసాడు.

సునీల్ నెక్ట్స్ మూవీకి డిఫ‌రెంట్ టైటిల్..!

క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్ న‌టించిన తాజా చిత్రం ఈడు గోల్డ్ ఎహే. వీరు పోట్ల తెర‌కెక్కించిన ఈడు గోల్డ్ ఎహే చిత్రం ద‌స‌రా కానుక‌గా రిలీజై స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతుంది.