కళ్యాణ వైభోగమే కి అదే హైలెట్ అంటున్న నిర్మాత దామోదర ప్రసాద్..

  • IndiaGlitz, [Tuesday,February 23 2016]

నాగ శౌర్య - మాళ‌విక నాయ‌ర్ జంట‌గా నందినీ రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం క‌ళ్యాణ వైభోగ‌మే. ఈ చిత్రాన్ని రంజిత్ మూవీస్ బ్యాన‌ర్ పై దామోద‌ర ప్ర‌సాద్ నిర్మించారు. మార్చి 4న క‌ళ్యాణ వైభోగ‌మే చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత దామోద‌ర ప్ర‌సాద్ మాట్లాడుతూ...క‌ళ్యాణి మాలిక్ అందించిన మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ ల‌భిస్తుంది.
ప్ర‌తి సినిమా ఆడియో బాగుంద‌ని చెబుతాం. కానీ నిజంగా ఇప్ప‌టి వ‌ర‌కు మా బ్యాన‌ర్ లో వ‌చ్చిన చిత్రాల‌న్నింటి కంటే బెట‌ర్ ఆడియోను క‌ళ్యాణి మాలిక్ అందించారు. క‌ళ్యాణం పై వ‌చ్చే సాంగ్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత పెళ్లిల్లో ఈ పాట‌ను ఉప‌యోగిస్తార‌న్న‌ది నా న‌మ్మ‌కం. ఈ సినిమాలోని అన్నిపాట‌ల‌కు ల‌క్ష్మీ భూపాల్ చ‌క్క‌ని సాహిత్యాన్ని అందించారు. నా ప్ర‌తి సినిమాలో ఎవ‌రో ఒక‌ర్నికొత్త వాళ్ల‌ను ప‌రిచ‌యం చేస్తుంటాను. ఈ సినిమా ద్వారా కెమెరామెన్ రాజును ప‌రిచ‌యం చేసాను. మేము ఊహించిన దాని కంటే మంచి అవుట్ పుట్ అందించాడు.
నా ఆలోచ‌న‌లు, నందినీ రెడ్డి ఆలోచ‌న‌లు ఒకేలా ఉంటాయి. అలా...మొద‌లైంది నందినీ రెడ్డితో సినిమా అన‌గానే అంచనాలు ఉంటాయి. ఆ అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమాలో ల‌వ్ స్టోరీ హైలెట్ అని చెప్ప‌వ‌చ్చు. అలాగే దీనిలో ఓ మంచి సందేశం కూడా ఉంది. ఆ మెసేజ్ ని ఎంట‌ర్ టైన్మెంట్ గా చెప్పాం. అందుచేత ఆడ‌, మ‌గ చిన్న‌, పెద్ద అనే తేడా లేకుండా అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది క‌ళ్యాణ వైభోగ‌మే అన్నారు.

More News

నాని హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ చిత్రం

'చిన్నోడు పెద్దోడు'తో నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టి, 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు', 'మిత్రుడు' వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ కొంత విరామం తర్వాత ఓ చిత్రం నిర్మిస్తున్నారు.

బాలయ్య వందో సినిమా డైరెక్టర్ ఇతనే..

బాలయ్య వందో సినిమాని సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

పవన్ గురించి రజనీకాంత్ కామెంట్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజు -ఇమేజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.సినిమాలు సరే...రాజకీయాలను సైతం ప్రభావితం చేసేంత పవర్ ఉన్న స్టార్ పవన్ కళ్యాణ్.

ఆడియెన్స్ కు కనెక్ట్ కావడానికి చాలా కష్టపడ్డాను - ఆదాశర్మ

పివిపి నిర్మాణ సంస్థ,మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ తో కలిసి నిర్మించిన సస్పెన్స్ డ్రామా ‘క్షణం’.

దర్శకుడి తమ్ముడని అవకాశం రాలేదు - వేదా.కె

మంచు మనోజ్,రెజీనా హీరో హీరోయిన్లుగా బేబి త్రిష సమర్పణలో సురక్ష ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి.బ్యానర్ పై కె.దశరథ్ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన చిత్రం శౌర్య.