close
Choose your channels

సుమా రంగనాథన్ ప్రధాన పాత్రలో 'దండుపాళ్యం 4'

Tuesday, April 24, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

undefined

ఒకప్పుడు బోల్డ్ బ్యూటీగా పేరొందిన సుమా రంగనాథన్ (సుమన్ రంగనాథన్) ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేస్తూనే ఉన్నారు. ఆమె నటించిన 'మైనా', 'నీర్ దోసే' చిత్రాలు ఇటీవల విశేషాదరణ చూరగొన్నాయి. కన్నడనాట తన తడాఖా చూపిస్తోన్న సుమన్ రంగనాథన్ 'దండుపాళ్యం-4'లోనూ విలక్షణమైన పాత్రను పోషించారు.

ఈ చిత్రానికి 'దండుపాళ్యం' ట్రయాలజీకి ఎలాంటి సంబంధం లేదు. ఈ 'దండుపాళ్యం-4'లో తమ జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ 'దండుపాళ్యం 4' రూపొందింది. ఇందులో  ఏడుమంది గ్యాంగ్ కు నాయకురాలిగా సుమా రంగనాథన్ నటించారు. ఈ చిత్రం ఇప్పటికి 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ చిత్ర కథ కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిందని సుమా రంగనాథన్ చెప్పారు. 40 మంది గ్యాంగ్ లో ఎనిమిది మంది జైలులో ఉంటారు. వారిని తప్పించడానికి సాగే పథకరచనతోనే ఈ సినిమా రూపొందిందని ఆమె వివరించారు.

ఈ చిత్రంలో నటిస్తున్నంత సేపు ఎంతో ఎంజాయ్ చేశానని సుమా రంగనాథన్ చెబుతున్నారు. ఏడుమంది గ్యాంగ్ ఎలా ప్రవర్తించారు, ఎలా నిదురించారు, ఏమి తిన్నారు ఇలాంటి అంశాలను సైతం ఎంతో చక్కగా తెరకెక్కించారని, 35 రోజుల షూటింగ్ తో తన పాత్ర చిత్రీకరణ పూర్తవుతుందని ఆమె తెలిపారు. పాత్ర నచ్చడం, కథలోని వైవిధ్యం తనకెంతగానో నచ్చాయని, వేడి పుట్టిస్తున్న వేసవిలోనూ సెట్స్ లో ఎంతో ఎంజాయ్ చేస్తూ నటించానని ఆమె అన్నారు.

ఒకప్పుడు హాట్ గాళ్ గా తెలుగువారిని సైతం పలు చిత్రాల్లో అలరించిన సుమా రంగనాథన్, తరువాత కన్నడ, తమిళ చిత్రాలకే పరిమితమయ్యారు. ఆ తరువాత చాలా రోజులు తెరపై కనిపించలేదు. తన దరికి చేరిన పాత్రలు మాత్రం పోషిస్తూ ఉండేవారు.

ఈ మధ్య తనకు ఎంతో ఇష్టమైన 'సైకాలజీ'లో డిప్లొమా చేశారు. ఆగస్టులో డిప్లొమా పొందనున్నారు. "మనిషిని, వారి మనస్తత్వాన్ని చదవడానికి 'సైకాలజీ' ఎంతో ఉపయోగపడుతుంది. అందుకనే ఈ సబ్జెక్ట్ అంటే నాకు మొదటి నుంచీ ఇష్టం. 'దండుపాళ్యం 4' పూర్తి కాగానే మరిన్ని కోర్సులు చేయాలని ఉంది. తప్పకుండా చేస్తాను" అంటూ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు సుమా రంగనాథన్.

కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, బెల్గామ్, చిత్రదుర్గ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది.  ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేయాలని దర్శకనిర్మాత కె.టి. నాయక్ ప్లాన్ చేశారు. కన్నడ, తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సంజీవ్, విఠల్, అరుణ్ బచ్చన్, రిచా శాస్త్రి, బుల్లెట్ సోము, స్నేహ ఇతర ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి ఆనంద్ రాజా విక్రమ సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్.గిరి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.