close
Choose your channels

రజనీ ‘దర్బార్’ రిలీజ్..: ఉద్యోగులకు బంపరాఫర్!!

Tuesday, January 7, 2020 • తెలుగు Comments

రజనీ ‘దర్బార్’ రిలీజ్..: ఉద్యోగులకు బంపరాఫర్!!

టైటిల్ చూడగానే కాస్త ఆశ్చర్యంగా ఉంది.. ఆశ్చర్యపోయినా సరే మీరు వింటున్నది నిజమే.! తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు.. హీరోకు సంబంధించిన ముఖ్యమైన రోజుల్లో (బర్త్ డే, మ్యారేజీ డే), ఫంక్షన్లలో అభిమానులు తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. అయితే ‘అభిమానులందు సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు వేరయ్యా..’ అనే విషయం తెలిసిందే. రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతోందంటే ఇక పరిస్థితి మామూలుగా ఉండదు.. రచ్చరచ్చే!. ఇలాగే రజనీకాంత్‌పై అమితాభిమానం ఉండే ఓ కంపెనీ యాజమాన్యం ఈ నెల 09న రిలీజ్ కానున్న ‘దర్బార్’ మూవీ రిలీజ్‌కు గాను ‘మై మనీ మంత్ర’ కంపెనీ యాజమాన్యం ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది.

రిలీజ్ రోజున సెలవులు ప్రకటించింది.. అంతేకాదు సినిమాకెళ్లి ఎంజాయ్ చేయండి అని ఉద్యోగులందరికీ టికెట్లు కూడా బుక్ చేసింది. కాగా ఈ కంపెనీ చెన్నైకి సంబంధించినది. ఇలా రజనీ సినిమాలకు సెలవులు ప్రకటించడం ఇదేమీ కొత్త కాదు.. ఈ ట్రెండ్ చెన్నైలో ఎప్పట్నుంచో ఉంది. గతంలో ‘కబాలి’, ‘2.0’ సినిమాలు విడుదలైనపుడు కూడా ఇలాగే కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు హాలీడే ఇచ్చిన సంగతి తెలిసిందే.

సూపర్‌ స్టార్ రజనీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్‌ మురగదాస్ తెరకెక్కించిన భారీ చిత్రం ‘దర్బార్‌’. రజనీ చాలా కాలం తరువాత పోలీస్‌ అధికారి పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి ముందే రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Get Breaking News Alerts From IndiaGlitz